'ప్రపంచంలో ధోనీయే బెస్ట్ ఫినిషర్' | Virat Kohli feels MS Dhoni is the best finisher in the world | Sakshi
Sakshi News home page

'ప్రపంచంలో ధోనీయే బెస్ట్ ఫినిషర్'

Published Tue, Mar 8 2016 10:55 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

'ప్రపంచంలో ధోనీయే బెస్ట్ ఫినిషర్'

'ప్రపంచంలో ధోనీయే బెస్ట్ ఫినిషర్'

న్యూఢిల్లీ: ప్రపంచంలో బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అని యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ కితాబిచ్చాడు. ఆసియా కప్ విజయం తమలో మరింత ఆత్మవిశ్వాసం కలిగించిందని, టి-20 ప్రపంచ కప్లో విజయపరంపర కొనసాగిస్తామని విరాట్ ధీమా వ్యక్తం చేశాడు.

ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి ధోనీసేన కప్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గురించి కోహ్లీ మాట్లాడుతూ.. 'ఓపెనర్ శిఖర్ ధవన్ బాగా ఆడాడు. కావాల్సిన రన్రేట్కు తగినట్టుగా ఆడాలని చూశా. ధవన్ అవుటయ్యాక కాస్త ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో బ్యాటింగ్కు దిగిన ధోనీ అద్భుతంగా ఆడాడు. కీలక సమయంలో తన సత్తాచాటాడు. ఈ మ్యాచ్ అద్భుతమైనది' అని అన్నాడు. ఫైనల్లో ధోనీ 6 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement