
మెల్‌బోర్న్: వన్డేలు, టి20ల్లో తమ జట్టుకు ఒక సరైన ఫినిషర్ అవసరం ఉందని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు. అందుకు భారత స్టార్ ఎమ్మెస్ ధోని తరహా ఆటగాడైతే సరిగ్గా సరిపోతాడని అతను అన్నాడు. ‘గతంలో ఆస్ట్రేలియా జట్టుకు మైకేల్ బెవాన్, మైక్ హస్సీలాంటి వారు మ్యాచ్‌ను ముగించే బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. ఇంగ్లండ్‌కు ఇప్పుడు బట్లర్ అలాంటి పని చేస్తున్నాడు. ఇక ఎమ్మెస్ ధోని అయితే ఈ విషయంలో మాస్టర్‌లాంటివాడు. ప్రపంచంలో ప్రతీ జట్టు ఇప్పుడు ఇలాంటి క్రికెటర్లను కోరుకుంటోంది’ అని లాంగర్ వ్యాఖ్యానించాడు. ఇక ఆస్ట్రేలియా జట్టులో ‘ఫినిషర్’గా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆటగాళ్లు పోటీ పడాలని కూడా కోచ్ సూచించాడు. గతంలో మార్కస్ స్టొయినిస్‌ను ఆసీస్ ప్రయత్నించినా అతను ఘోరంగా విఫలమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment