ధోని కాదు కోహ్లి బెస్ట్ ఫినిషర్: గంభీర్ | Kohi, not Dhoni, is the finisher for me: Gambhir | Sakshi
Sakshi News home page

ధోని కాదు కోహ్లి బెస్ట్ ఫినిషర్: గంభీర్

Published Mon, Mar 7 2016 5:39 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

ధోని కాదు కోహ్లి బెస్ట్ ఫినిషర్: గంభీర్

ధోని కాదు కోహ్లి బెస్ట్ ఫినిషర్: గంభీర్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో బెస్ట్ ఫినిషర్ ఎవరంటే ఎంఎస్ ధోని పేరే చెబుతారు. కానీ తన దృష్టిలో బెస్ట్ ఫినిషర్ విరాట్ కోహ్లి అని ధోని కాదని ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. 'బెస్ట్ ఫినిషర్ ట్యాగ్ ధోనికి మీడియా ఇచ్చింది. నా దృష్టిలో కోహ్లి బెస్ట్ ఫినిషర్. ఓపెనర్ కూడా ఫిషనర్ గా చెప్పవచ్చు. 6 లేదా 7 స్థానంలో బ్యాటింగ్ దిగిన వాళ్లను మాత్రమే ఫినిషర్ అనాల్సిన అవసరం లేద'ని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో అన్నాడు.

కచ్చితంగా ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో ధోని నిర్ణయించుకోవాలని సూచించాడు. కెప్టెన్ బాగా ఆడినంత మాత్రానా సరిపోదని జట్టు మొత్తంగా బాగా ఆడితేనే విజయం దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. టి20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు యువరాజ్ సింగ్ ఫామ్ రావడం టీమిండియాకు సానుకూలాంశమని చెప్పాడు.

2013లో ఐపీఎల్ లో విరాట్ కోహ్లితో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ... మైదానంలో కామెంట్లను వ్యక్తిగతంగా తీసుకోనని అన్నాడు. మైదానంలో సీరియస్ గానే ఉంటానని, అవరసరమైతే మరోసారి గొడవకు సిద్ధమని ప్రకటించాడు. కెప్టెన్ దృఢంగా ఉంటనే టీమ్ కూడా గట్టిగా ఉంటుందని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement