భోపాల్: ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగలింది. బీజేపీ నేత సినిమా రేంజ్‌లో 400 కార్ల క్వానాయ్‌తో బయలుదేరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొన్ని నెల్లలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేత కాంగ్రెస్‌లో చేరడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు.. ఆయన కాన్వాయ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ నేత జైజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు సింగ్. గురువారం ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికల సందర్భంగా 400 కార్ల కాన్వాయ్‌తో దాదాపు 300 కిలోమీటర్లు సైరన్ వేసుకుంటూ ప్రయాణించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇక, ఆయనను మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ పార్టీలోకి ఆహ్వానించారు. రాజధాని భోపాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బైజ్‌నాథ్ సింగ్ తన బలప్రదర్శన చేశారు. శివ్‌పురి జిల్లా నుంచి 400 వందల కార్లతో 300 కిలోమీటర్ల దూరం ఉన్న భోపాల్‌కు భారీ ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా కార్లకు సైరన్ వేసుకుంటూ ప్రయాణించారు. ఈ ర్యాలీలో భాగంగా మార్గ మధ్యలో అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. 15 మంది జిల్లా స్థాయి నేతలు, ఇతర కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాకు చెందిన బైజ్‌నాథ్ అక్కడ పేరున్న నేత. ఆయనకు గ్రౌండ్ లెవల్ నుంచి ప్రజల మద్దతు ఉంది. కాగా, అంతకుముందు 2020లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు చేసి బీజేపీలోకి వెళ్లడంతో కమల్‌నాథ్ సర్కారు కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బైజ్‌నాథ్ సింగ్ కూడా సింధియా వెంటనే బీజేపీలో చేరారు. అనంతరం, బీజేపీలో ఆయనకు తగిన గుర్తింపు లభించకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.
ఇక, బైజ్‌నాథ్ సింగ్ కార్ల ర్యాలీపై బీజేపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో ఆయనపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇలా సైరన్ల వాడటమేంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ప్రజలకు అసౌకర్యం కల్పించేలా సైరన్లు వినియోగించడం కాంగ్రెస్ పార్టీ నేతల మనస్తత్వమని మండిపడింది.
Madhya Pradesh: BJP leader Baijnath Singh heads to rejoin Congress in 400-car convoy.pic.twitter.com/a7cofthV0R
— Annu Kaushik (@AnnuKaushik253) June 15, 2023
ఇది కూడా చదవండి: బసవరాజ బొమ్మైతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య భేటీ..
Comments
Please login to add a commentAdd a comment