భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హఠాత్తుగా ఆయన అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు కూడా పంపించారు. అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ కమల్‌నాథ్ రాజీనామాను ఆమోదించడంతో పాటు డాక్టర్ గోవింద్ సింగ్‌ను తదుపరి సీఎల్పీ నాయకుడిగా నియమించింది. కాగా కమల్‌నాథ్ సడన్‌గా తన పదవికి రాజీనామా ఎందుకు చేశారనే సమాచారం తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏప్రిల్ 28న కమల్‌నాథ్‌కు రాసిన లేఖలో.. కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రతి పక్షనాయకుడి పదవికి మీరు చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదించింది. సీఎల్పీ నాయకుడిగా మీరందించిన సహాయ సహకారాన్ని పార్టీ ధన్యవాదాలు తెలుపుతోందని అన్నారు. ఇకపై మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేతగా గోవింద్ సింగ్ కొనసాగనున్నారు.
చదవండి: BSP Mayawati: దేశానికి ప్రధాని కావాలన్నదే నా డ్రీమ్..
Comments
Please login to add a commentAdd a comment