Leader of the Opposition
-
ప్రతిపక్ష నేత ఎంపికపై సందిగ్ధం..! నాన్చుతున్న కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను వచ్చే నెల 7వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచి్చనప్పటికీ..రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఎవరన్న దానిపై ఇంకా కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చలేదు. తదుపరి ప్రతిపక్ష నేత ఎంపికపై ఇంతవరకూ కాంగ్రెస్ ఎలాంటి చర్చలు జరుపకపోవడంతో ఉత్కంఠ మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలున్నాయి. కనీసం సమావేశాల నాటికైనా కాంగ్రెస్ నిర్ణయం చేస్తుందా? లేక ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేనే ప్రతిపక్ష„ నేతగా కొనసాగిస్తుందా? అన్నది కొంత ఆసక్తిగా మారింది. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’అన్న కాంగ్రెస్ నిబంధన మేరకు ఏఐసీసీ అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన రోజునే ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తూ తన లేఖను అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాం«దీకి పంపారు. అనంతరం కొత్త నేతను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ హోదాలో సోనియాగాంధీ ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ అది జరుగలేదు. ప్రధానంగా పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్‌లలో ఒకరిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా దక్షిణాదికి చెందిన ఖర్గే ఉన్నందున ఉత్తరాదికి చెందిన దిగ్విజయ్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని చర్చ జరిగింది. వీరితో పాటే సీనియర్ నేతలు పి.చిదంబరం, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీలపేర్లు చర్చల్లోకి వచ్చాయి. అయితే శీతాకాల సమావేశాల సమయంలోనూ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో జైరా, దిగి్వజయ్ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరూ సభకు హాజరయ్యే అవకాశాలు తక్కువని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఈ నేపథ్యంలో ఖర్గేను శీతాకాల సమావేశాల వరకు ప్రతిపక్ష నేతగా కొనసాగిస్తారంటున్నారు. దీనిపై ఏఐసీసీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ ‘సమావేశాలకు కొద్ది రోజుల ముందు ప్రతిపక్ష నేత ఎంపికపై నిర్ణయం చేస్తారు’అని వ్యాఖ్యానించారు. చదవండి: ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్ -
అనూహ్య పరిణామం.. కీలక పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హఠాత్తుగా ఆయన అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు కూడా పంపించారు. అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ కమల్‌నాథ్ రాజీనామాను ఆమోదించడంతో పాటు డాక్టర్ గోవింద్ సింగ్‌ను తదుపరి సీఎల్పీ నాయకుడిగా నియమించింది. కాగా కమల్‌నాథ్ సడన్‌గా తన పదవికి రాజీనామా ఎందుకు చేశారనే సమాచారం తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏప్రిల్ 28న కమల్‌నాథ్‌కు రాసిన లేఖలో.. కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రతి పక్షనాయకుడి పదవికి మీరు చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదించింది. సీఎల్పీ నాయకుడిగా మీరందించిన సహాయ సహకారాన్ని పార్టీ ధన్యవాదాలు తెలుపుతోందని అన్నారు. ఇకపై మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేతగా గోవింద్ సింగ్ కొనసాగనున్నారు. చదవండి: BSP Mayawati: దేశానికి ప్రధాని కావాలన్నదే నా డ్రీమ్.. -
రష్యా ప్రతిపక్ష నేతపై విషప్రయోగం?
మాస్కో: రష్యా ప్రతిపక్ష రాజకీయ నాయకుడు అలెక్సీ నావల్నీపై విషప్రయోగం జరిగిందని ఆయన అనుచరులు వెల్లడించారు. ఆయన కోమాలో వెళ్ళడంతో, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంచి, చికిత్స చేస్తున్నారు. నావల్నీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నారు. సైబీరియాలోని టోమ్స్క్ నగరం నుంచి మాస్కోకి విమానంలో వెళుతుండగా అనారోగ్యానికి గురవడంతో ఓమ్స్క్ నగరంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు నావల్నీ అధికార ప్రతినిధి కిరా యర్మిష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలోని కేఫ్‌లో టీ తాగారని, అనుమానాస్పదమైన పదార్థం ఏదైనా టీలో కలిపి ఉంటారని ఆమె వెల్లడించారు. విమానంలో నావల్నీకి చెమటలు పట్టడం ప్రారంభమైందనీ, బాత్రూంలోకి వెళ్ళి స్పృహ కోల్పోయారని వెల్లడించారు. తీవ్ర వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి పుతిన్, ఘోరంగా వ్యవహరిస్తున్నారని నావల్నీ సన్నిహితుడు వ్లాదిమిర్ మిలో ట్వీట్ చేశారు. నావల్నీపై విషప్రయోగం జరిగిందనే విషయాన్ని పోలీసులు అంగీకరించడం లేదని అధికార మీడియా సంస్థ టాస్ పేర్కొంది. గతంలో కూడా నావల్నీపై అనుమానిత విషప్రయోగం జరగ్గా ఆసుపత్రి పాలయ్యారు. -
వాటిని పెద్దగా పట్టించుకోను తనపై వస్తున్న విమర్శలపై
స్పీకర్ కాగోడు తిమ్మప్ప సమాధానం బెంగళూరు:ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ తనపై వస్తున్న విమర్శలపై ప్రతిస్పందించేందుకు స్పీకర్ కాగోడు తిమ్మప్ప నిరాకరించారు. అలాంటి విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని అన్నారు. అది ఓ ముగిసిపోయిన అధ్యాయమంటూ సమాధానమిచ్చారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను తెలియజేసే అధికారం ఉందని అన్నారు. ఎవరి అభిప్రాయాలను వారు చెబుతూ ఉంటారని, అలాంటి వ్యాఖ్యలన్నింటిపై తాను స్పందించబోనని, అసలు పట్టించుకోనని తెలిపారు. తాను ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదని, కేవలం ఒక స్పీకర్‌గా ఆ పదవికి మాత్రమే న్యాయం చేస్తున్నానని స్పష్టం చేశారు. కాగా, గత కొంతకాలంగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప మంత్రుల పనితీరుపై బహిరంగ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి అనుయాయులు సిద్ధమయ్యారంటూ వార్తలు వెలువడిన విషయం తెలసిందే. ఈ ఘట్టానికి ముగింపు పలికేందుకే స్పీకర్ కాగోడు తిమ్మప్ప ‘అది ఓ ముగిసిపోయిన ఘట్టం’ అంటూ విలేకరులతో చెప్పారని తెలుస్తోంది. -
కార్టూన్ ( 09-10-2014 )
నిజమే సార్! ప్రతిపక్ష హోదా కూడా మనకు దక్కకుండా చేశారు.. ఆయనే అధికార పక్షనేత, ప్రతిపక్ష నేత!! -
బాబు ప్రతిపక్ష నేత భ్రమలోనే ఉన్నారు!
పలమనేరు: చంద్రబాబునాయుడు తాను ఇంకా ప్రతిపక్షనేత అనే భ్రమలోనే ఉన్నట్టున్నారని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి విమర్శించారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకొచ్చినా ఆ పార్టీ నాయకులు మాత్రం వారి ఉనికిని కాపాడుకునే పనిలో ఉన్నారని తెలిపారు. పింఛన్ల కమిటీ విచారణ పూర్తిగా ఆ పార్టీ సమావేశాల్లా మారాయని ఎద్దేవా చేశారు. కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వని ఈ ప్రభుత్వం ఉన్న వాటిని ఊడగొట్టడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, త్వరలో ప్రజాగ్రహం తప్పదని జోస్యం చెప్పారు. రుణమాఫీ జరగక రైతులు పడుతున్న ఆవేదన ఈ ప్రభుత్వానికి శాపంలా మారకతప్పదన్నారు. చంద్రబాబు హామీతో 8 శాతం వడ్డీ 14 శాతంగా పెరిగి బంగారు నగలు వేలం వేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. మంచినీటి సమస్య పరిష్కారంలో భాగంగా జిల్లాలోని పడమటి మండలాల్లో ఒక్క బోరైనా డ్రిల్ చేశారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ గెలుపొందిన స్థానాలపై చిన్నచూపు చూస్తున్నారని, ‘మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక తెలుగుదేశం కార్యకర్తలకా’ అని ప్రశ్నించారు. చాలా మంది మంత్రులకు వారి శాఖల గురించి అవగాహన లేదని, వీరు ప్రజా సమస్యలను గాలికొదిలి లోకేష్‌బాబు జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామా అని ఇప్పటికే జనం భాధపడుతున్నారని, త్వరలోనే వీరికి తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ శారదా, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సీవీ.కుమార్ పాల్గొన్నారు. -
తమ్ముళ్ల తగవు
సాక్షి, కడప : ప్రతిపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలి. అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలి. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇది ఇటీవల ప్రతి సమావేశంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్న మాటలు. అయితే జిల్లాలో వాస్తవ పరిస్థితి ఇందు కు భిన్నంగా ఉంది. టీడీపీ శ్రేణులు వర్గ విభేదాలతో రగిలిపోతున్నారు. జిల్లా రాజకీయాలను ఒకరిద్దరు నేతలే శాసిస్తుండటం ఒక స్థాయి నేతలకు మింగుడు పడటం లేదు. ఆధిపత్య పోరులో ఒక్కొక్కరు ఒక్కో గ్రూపును నియోజకవర్గాల్లో పెంచి పోషిస్తుండటంతో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల బద్వేలులో నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఇద్దరు నియోజకవర్గ నేతల వర్గీయులు బహిరంగ యుద్ధానికి దిగారు. ఆ సంఘటన మరువక ముందే కడపలో జరిగిన విసృ్తత స్థాయి సమీక్షా సమావేశం కూడా రచ్చ రచ్చగా మారింది. పార్టీలోని కీలక నేతలు నియోజకవర్గాల పరిధిలోని నాయకుల విషయంలో ఏకపక్ష ధోరణిలో ఉండటమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో తమ్ముళ్లు పండుగ చేసుకుంటుండగా, జిల్లాలో నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో రోజురోజుకు పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తొమ్మిది స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో కనీసం పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు రాజంపేటకు చెందిన మేడా మల్లికార్జునరెడ్డికి విప్‌తోపాటు ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డికి శానమండలి డిప్యూటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయినా ఫలితం కనిపించలేదు. కడపకు చెందిన పలువురు నేతలు జిల్లా అధ్యక్షుడిపైనే చంద్రబాబుకు ఫిర్యా దు చేసేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. కడపలో ఎవరికి వారే! కడపలో పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. ఇక్కడ ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రెస్మీట్లు, ఆందోళనలు వేర్వేరుగా చేసుకుంటూనే ముందుకు వెళుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కనీసం పలుకరించే వారు కూడా లేరని పలువురు టీడీపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ్ముళ్ల మధ్య తగువు లాటలతో పార్టీ ప్రతిష్ట బజారున పడుతోందని కార్యకర్తలు మథనపడుతున్నారు. -
సీవీసీ నియామక ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత అంశంపై స్పీకర్ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. అరుునప్పటికీ కేంద్రం సోమవారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) నియూమక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నామినేషన్లు కోరింది. నిజారుుతీగా, నిష్పాక్షికంగా వ్యవహరించే, ఈ పోస్టుకు పరిశీలించదగిన వారి పేర్లను సూచించాల్సిందిగా కోరుతూ కేబినెట్ కార్యదర్శితో పాటు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) లేఖ రాసింది. సీవీసీతో పాటు సీవీసీ కార్యాలయంలో విజిలెన్స్ కమిషనర్ పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. నిబంధనల ప్రకారం.. ప్రధాని నేతృత్వంలోని హోం మంత్రి, ప్రతిపక్ష నేతలతో కూడిన త్రిసభ్య సెలెక్షన్ కమిటీ సిఫారసు ఆధారంగా రాష్ట్రపతి సీవీసీ, వీసీల నియూమకం చేపడతారు. ప్రతిపక్ష నేత ఖరారుకాని పక్షంలో ఏకైక అతిపెద్ద పార్టీ నేత.. ప్రతిపక్ష నేతగా ఉంటారని డీవోపీటీ కార్యదర్శి ఇతర మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు రాసిన లేఖలోని మార్గదర్శకాలు పేర్కొన్నారుు. -
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆజాద్!
ఉప నేతగా ఆనంద్శర్మల ఎంపిక పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వివేది వెల్లడి న్యూఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేత కావడం లాంఛనమే. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఆజాద్ ఎంపిక విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది ఆదివారమిక్కడ ప్రకటించారు. యూపీఏ-2 హయాంలో మంత్రిగా పనిచేసిన ఆనంద్‌శర్మ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉప నేతగా నియమితులైనట్టు తెలిపారు. ఆజాద్, ఆనంద్శర్మలిద్దరినీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ పదవులకు నామినేట్ చేశారని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవి పొందేందుకు అవసరమైన సభ్యుల సంఖ్య కాంగ్రెస్‌కు ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో కాంగ్రెస్‌కు 65 మంది సభ్యులున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత పదవి పొందేందుకు సభలోని మొత్తం సభ్యుల్లో పదిశాతం ఉంటే చాలు. ఆ మేరకు ఆజాద్ ప్రతిపక్ష నేత పదవి పొందడం ఖాయమైంది. ఇప్పటికే లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కర్ణాటకు చెందిన దళిత నేత మల్లికార్జున ఖర్గేను, ఉప నాయకుడిగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌ను నియమించడం తెలిసిందే. -
ఆంధ్రా ‘మండలి’ విపక్ష నేతగా సీఆర్
కాంగ్రెస్ ఎమ్మెల్సీల అభిప్రాయం మేరకే: దిగ్విజయ్ 11 మంది ఎమ్మెల్సీలతో ఢిల్లీ పెద్దల భేటీ సీఆర్ ఎంపికలో తెర వెనక చిరంజీవి ఒత్తిళ్లు! హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (కౌన్సిల్) ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఏపీసీసీ కార్యాలయం ఇందిరాభవన్‌లో జరిగిన మండలి ప్రతిపక్ష నేత ఎంపిక కార్యక్రమం ఆద్యంతం హైడ్రామా నడిచింది. ఢిల్లీ నుంచి ఏఐసీసీ పరిశీలకులు దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి, కుంతియా, తిరునావక్కరుసు తదితరులు సాయంత్రం 4 గంటలకు.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉమ్మడి రాష్ట్ర కౌన్సిల్లో మొత్తం 90 మంది ఎమ్మెల్సీలుండేవారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు 40 మంది, ఆంధ్రప్రదేశ్‌కు 50 మందిగా ఎమ్మెల్సీల విభజన జరిగింది. ఈ 50 మందిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు 14 మంది ఉండగా.. వారిలో సింగం బసవపున్నయ్య, ఎ.లక్ష్మీ శివకుమారి, బాలసాలి ఇందిరలు మంగళవారం నాటి సమావేశానికి గైర్హాజరయ్యారు. సమావేశానికి హాజరైన 11 మంది పార్టీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరితో ఏకాంతంగా సమావేశమైన దిగ్విజయ్, వయలార్ తదితర నేతలు వారి అభిప్రాయాలు అడిగారు. ఓటింగ్ నిర్వహించాలా, సీక్రెట్ ఓటింగ్ పెట్టాలా, అందరి అభిప్రాయాలు, తీర్మానం మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం మేరకు అంగీక రిస్తారా? అని కోరారు. అయితే తెలంగాణ శాసనసమండలిలో పార్టీ ఎమ్మెల్సీల అభిప్రాయల మేరకు తీర్మానం చేసి నేతను నిర్ణయించడంతో ఇక్కడా అలాగే చేయాలని మెజారిటీ సభ్యులు చెప్పటంతో.. సోనియా నిర్ణయానికి తామంతా కట్టుబడే ఉంటామని ఎమ్మెల్సీలు చేసిన తీర్మానం ప్రతిని ఢిల్లీ పెద్దలు తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీకి సమాచారం అందించారు. దీనిపై సోనియా నిర్ణయం కోసం అంతా దాదాపు గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. దిగ్విజయ్ ఐదు నిమిషాలకో మారు ఢిల్లీకి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. సోనియా అందుబాటులోకి రాలేదు. చాలా సేపటి తరువాత ఆమె అందుబాటులోకి రావడంతో సీఆర్‌ను ఎంపిక చేసిన విషయాన్ని ఆమెకు తెలియజేసి ఆమోదం తీసుకున్నారు. అనంతరం ఏపీ శాసన మండలి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా సి.రామచంద్రయ్యను ఎంపిక చేసినట్టు దిగ్విజయ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎమ్మెల్సీల అభిప్రాయాల మేరకే సి.రామచంద్రయ్యను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఆయన ఇప్పటికే శాసనమండలి నాయకుడిగా వ్యవహరిస్తున్నందున ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశం మేరకే ఆయనను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేశామని తెలిపారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం: సీఆర్ కాంగ్రెస్ ఇప్పుడు క్లిష్టపరిస్థితుల్లో ఉందని, ఎమ్మెల్సీలంతా సహకరిస్తే కౌన్సిల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరించి తమ వాణిని వినిపిస్తామని మండలి ప్రతిపక్ష నేతగా ఎంపికైన సీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను సక్రమంగా అమలుచేసేలా కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాగా, మండలిలో ప్రతిపక్ష నేతగా రుద్రరాజు పద్మరాజుకే అవకాశం ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండగా అనూహ్యంగా రామచంద్రయ్యను ఎంపిక చేయడం వెనుక మాజీ కేంద్రమంత్రి చిరంజీవి ఒత్తిళ్లు పనిచేసినట్టు పార్టీలో బలంగా వినిపిస్తోంది. -
పదవి కోసం పెద్ద లోల్లి
రసాభాసగా సీఎల్పీ భేటీ డీఎస్, షబ్బీర్‌కు మద్దతుగా రెండుగా చీలిపోయిన ఎమ్మెల్సీలు అధిష్టానం దూతల ముందే దూషణలపర్వం డీఎస్ ఒక్కో ఎమ్మెల్సీకి రూ.10 లక్షలు ఆఫర్ చేశారన్న రాజలింగం ఆరోపణలను ఖండించిన డీఎస్ వర్గం హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత ఎంపిక కోసం మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీ సవ్యంగానే జరిగినట్టు పైకి కనిపిస్తున్నా లోపల మాత్రం పెద్ద గొడవే జరిగింది. ఎమ్మెల్సీలు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపైకి ఒకరు దూషణలపర్వానికి దిగారు. దీంతో అధిష్టానం పెద్దలు బిత్తరపోవాల్సి వచ్చింది. చివరికి వారు ఇరువర్గాలను శాంతింపజేసి ఎంపిక ప్రక్రియను మమ అనిపించారు. తనకు మద్దతివ్వాలంటూ ఒక్కో ఎమ్మెల్సీకి డి.శ్రీనివాస్ రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజలింగం ఏకంగా సీఎల్పీ సమావేశంలోనే ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్తో కుమ్మక్కైన డీఎస్‌కు మండలి ప్రతిపక్ష నేత పదవి ఎట్లా ఇస్తారంటూ నిలదీసిన రాజలింగంకు... మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం మద్దతు పలికారు. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్సీలూ డీఎస్‌పై ఆరోపణలు చేశారు. వీటిని ఖండిస్తూ డీఎస్ వర్గం.. షబ్బీర్ అలీపై ప్రత్యారోపణలు చేయడంతో సమావేశం ఒకదశలో రసాభాసగా మారింది. భేటీ అదుపు తప్పిందని గ్రహించిన హైకమాండ్ దూతలు వయలార్, దిగ్విజయ్‌సింగ్‌లు... ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరిని పిలిచి బుజ్జగింపు యత్నాలు ప్రారంభించారు. డీఎస్‌కు మండలి ప్రతిపక్ష నేత పదవి, షబ్బీర్ అలీకి ఉపనేత పదవి ఇస్తామని ప్రతిపాదించారు. ఇందుకు షబ్బీర్ అయిష్టత వ్యక్తం చేసినప్పటికీ ఆయన పేరును ప్రకటించారు. డీఎస్, షబ్బీర్ అలీ ఇద్దరూ నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. ఒకే జిల్లాకు రెండు పదవులు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బేరసారాలు బయటకు పొక్కడం, ఈ విషయం ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ మరింత చులకన అవుతుందనే ఉద్దేశంతోనే షబ్బీర్ అలీకి ఉపనేత పదవిని కట్టబెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 17 మంది.. రెండున్నర గంటల సినిమా! కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం సస్పెన్స్ సినిమాను తలపించింది. మండలిలో అధికార టీఆర్ఎస్తో పోలిస్తే ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. డీఎస్, షబ్బీర్ గత వారం రోజులుగా ఎమ్మెల్సీలతో ముఖాముఖి సమావేశమై మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. చివరి నిమిషం వరకు ఎమ్మెల్సీలతో మంతనాలు జరిపారు. అభిప్రాయ సేకరణ సమయంలోనూ ఇద్దరు నేతలు ఎవరికి వారే తమకే మండలి ప్రతిపక్ష నేత పదవి దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్‌కు 17 మంది ఎమ్మెల్సీలుండగా మంగళవారంనాటి సమావేశానికి 16 మంది మాత్రమే హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ తన సమీప బంధువు చనిపోవడంతో రాలేదు. సమావేశానికి హాజరైన వారిలో ఏడుగురు (కేఆర్ ఆమోస్, యాదవరెడ్డి, భానుప్రసాద్, వి.భూపాల్‌రెడ్డి, రాజలింగం, జగదీశ్వర్‌రెడ్డి, పీర్ షబ్బీర్ అహ్మద్) షబ్బీర్ అలీకి మండలి ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. అదే సమయంలో డీఎస్ పేరును ఏడుగురు (పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, నేతి విద్యాసాగర్, డి.రాజేశ్వర్, ఎమ్మెస్ ప్రభాకర్, బి.వెంకట్రావు, మాగం రంగారెడ్డి) ఎమ్మెల్సీలు ప్రతిపాదించారు. చివర్లో తాను డీఎస్‌కు మద్దతిస్తున్నట్లు సంతోష్‌కుమార్ లేఖ పంపడంతో హైకమాండ్ పెద్దలు డీఎస్ పేరును ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో రాజలింగం డీఎస్‌పై చేసిన ఆరోపణలు సమావేశంలో కలకలం రేపాయి. డీఎస్ రూ.10 లక్షలు ఇవ్వబోయారు: రాజలింగం సమావేశానంతరం రాజలింగం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఒక్కో ఎమ్మెల్సీకి డీఎస్ రూ.10 లక్షలు ఇచ్చారు. నాకు కూడా ఆఫర్ చేస్తే వద్దని తిరస్కరించాను. టీఆర్ఎస్తో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వంలో లోపాయికారీ పనులు చేసుకునేందుకే డీఎస్ మండలి ప్రతిపక్షనేత పదవిని ఆశించి అందరినీ మేనేజ్ చేస్తున్నాడు. 8 మంది ఎమ్మెల్సీలు వ్యతిరేకించినా హైకమాండ్ పెద్దలు ఆయన పేరునే ఖరారు చేశారు’’ అని అన్నారు. కాగా, రాజలింగం చేసిన ఆరోపణలకు విలువ లేదని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. షబ్బీర్‌కు హ్యాండిచ్చిన ప్రభాకర్! మండలి ప్రతిపక్షనేత పదవిపై గంపెడాశలు పెట్టుకున్న షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది. తనకు 8 మంది ఎమ్మెల్సీలు మద్దతు ఇస్తారని షబ్బీర్ భావించారు. వీరిలో ప్రభాకర్ కూడా ఉన్నట్లు షబ్బీర్ అలీ చెబుతున్నారు. అయితే సమావేశం ప్రారంభం వరకు తమతోనే ఉన్న ప్రభాకర్ చివరి నిమిషంలో డీఎస్వైపు వెళ్లారని షబ్బీర్ వాపోయారు. ఎన్నిక ఏకగ్రీవమే: వయలార్ మండలి ప్రతిపక్షనేతగా డీఎస్, ఉపనేతగా షబ్బీర్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వయలార్ రవి ప్రకటించారు. ఎమ్మెల్సీల సమావేశానంతరం దిగ్విజయ్‌సింగ్, వయలార్, పొన్నాల, డీఎస్ మీడియా ముందుకొచ్చారు. ఆ సమయంలో షబ్బీర్‌ను సైతం మీడియా ముందుకు రావాలని హైకమాండ్ పెద్దలు కోరినా ఆయన పట్టించుకోలేదు. తాను రానని పేర్కొంటూ వాహనం ఎక్కేందుకు ప్రయత్నించారు. కుంతియా, తిరునావక్కరసార్ ఆయనను బతిమిలాడి మీడియా ముందుకు తీసుకొచ్చారు. అనంతరం డీఎస్ మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. షబ్బీర్‌తో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఆ తర్వాత షబ్బీర్‌ను మాట్లాడాలని దిగ్విజయ్ కోరగా.. ‘ఇదేమైనా సంతోషకరమైన సమయమా? మాట్లాడటానికేముంది?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 30న టీ-కాంగ్రెస్‌లో సమీక్ష డీఎస్‌పై ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నాం: దిగ్విజయ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు నెలాఖరులో రెండు రోజులపాటు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 30, వచ్చే నెల 1న సమావేశం కానున్నట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ఓటమికి కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తామన్నారు. కాగా, ఎమ్మెల్సీలను డబ్బులతో ప్రభావితం చేయడం వల్లే మండలి ప్రతిపక్ష నేతగా సీనియర్ నేత డీఎస్ ఎన్నికయ్యారంటూ ఎమ్మెల్సీ రాజలింగం చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో గాంధీభవన్‌లో దిగ్విజయ్ సమావేశమయ్యారు. ఈ విషయంలో పటిష్ట వ్యూహంతో ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలవారీగా ఫలితాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
ప్రతిపక్ష నేతగా కమల్‌నాథ్!
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ ఎంపీ అయిన కమల్‌నాథ్‌ను నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎంపీగా సీనియారిటీ ప్రకారం చూస్తే.. ఆయననే ఆ పదవి వరించే అవకాశాలున్నాయన్నాయి. అయితే, మిగతా అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పార్టీ పార్లమెంటరీ పక్ష నేత ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తారని తెలిపాయి. లోక్‌సభలో కమల్‌నాథ్ కాకుండా లోక్‌జనశక్తి పార్టీకి చెందిన రామ్ విలాస్ పాశ్వాన్, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన పీఏ సంగ్మాలు అత్యంత సీనియర్ సభ్యులు. కనీసం 55 స్థానాల్లో విజయం సాధిస్తేనే నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా లభిస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 44 స్థానాల్లోనే గెలుపొందింది. అయితే, ఏ పార్టీకైనా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడమనేది స్పీకర్ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. -
స్పీకర్ నిర్ణయంపైనే కాంగ్రెస్‌కు విపక్ష నేత హోదా
పదోవంతు కంటే తక్కువ బలమే కారణం న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నేత హోదా కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడనుంది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్, కేవలం 44 సీట్లు మాత్రమే.. అంటే, మొత్తం 545 మంది సభ్యుల లోక్‌సభలో పది శాతానికంటే తక్కువ సీట్లు సాధించడం తెలిసిందే. బీజేపీ 282 స్థానాలు సాధించగా, 44 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రతిపక్ష హోదాకు సంబంధించి రెండు చట్టాలు , ‘లోక్‌సభ స్పీకర్ మార్గదర్శకాలు’ పుస్తకం ఉన్నాయి. పార్లమెంటులో గుర్తింపు పొందిన పార్టీలు, కూటముల నేతలు, చీఫ్ విప్ల చట్టం ప్రకారం 55 మందికి తక్కువ కాకుండా సభ్యులున్న ప్రతి పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా పరిగణిస్తారని ఒక అధికారి తెలిపారు. ప్రతిపక్ష నేతల వేతనం, అలవెన్సుల చట్టం కింద విపక్షాల్లో అత్యధిక సంఖ్యలో సభ్యులున్న పార్టీకి నేతగా ఉన్న వ్యక్తిని ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తిస్తారు. ఈ గుర్తింపు లభించిన నేతకు కేబినెట్ మంత్రితో సమానమైన సౌకర్యాలన్నీ లభిస్తాయి. ప్రతిపక్ష నేతను గుర్తించేందుకు కేవలం ప్రతిపక్ష నేతల వేతనం, అలవెన్సుల చట్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోరాదని, మరింత సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ అంశంపై కొత్త స్పీకరే తుది నిర్ణయం తీసుకుంటారన్నారు.