
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. 230 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 66 సీట్లకే పరిమితమైంది. దీంతో మధ్యప్రదేశ్‌లో ఓటమికి బాధ్యతవహిస్తూ.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఖాళీగా మారిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మరో నేతకు అప్పగించనున్నట్లు హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కమల్‌నాథ్ మంగళవారం.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ఇతర సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. వారి భేటీ అనంతరం రాజీనామా చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఢిల్లీ హైకమాండ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment