
రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మంగళవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. 28 ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించిన ఆయన.. తన మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ రాజ్‌భవన్‌లో వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. సజ్జన్ సింగ్ వర్మ, విజయలక్ష్మీ సాధూ, హుకుమ్ సింగ్ కరడ, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, బాలా బచ్చన్, అరిఫ్ అకిల్, ప్రదీప్ జైస్వాల్, ఇమ్రతీ దేవి తదితర ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
కాగా పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబరు 17న కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment