ఆ పారీ్టలోకి విద్వేష భూతం ప్రవేశించింది: మోదీ
వార్ధా: విపక్ష కాంగ్రెస్‌లోకి విద్వేష భూతం ప్రవేశించిందని, అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ (సమాజాన్ని విచి్ఛన్నం చేసే శక్తులు) ఆ పార్టీని నడిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘కాంగ్రెస్ అత్యంత అవినీతి పార్టీ. కాంగ్రెస్ రాజ కుటుంబం అత్యంత అవినీతి కుటుంబం’’ అని ధ్వజమెత్తారు. ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’కు ఏడాది పూర్తయిన మహారాష్ట్రలోని వార్ధాలో శుక్రవారం బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులు విదేశీ గడ్డపై దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రాహుల్‌గాంధీని ఉద్దేశించి ఆరోపించారు. ‘‘గణపతి పూజను సైతం కాంగ్రెస్ ద్వేషిస్తోంది. నేను గణపతి పూజలో పాల్గొంటే కాంగ్రెస్ నాయకులు బుజ్జగింపు రాజకీయాల కోసం నాపై ఆరోపణలకు దిగారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వినాయక విగ్రహాన్ని పోలీసు జీపెక్కించారు. అయినా మహారాష్ట్రలోని కాంగ్రెస్ మిత్రపక్షాలు నోరు విప్పలేదు. తెలంగాణలో ఇచ్చిన ఎన్నికల హామీలను అధికారంలోకి రాగానే పక్కన పెట్టింది. కాంగ్రెస్ అంటే అబద్ధం, మోసం’’ అని దుయ్యబట్టారు.
అంతర్జాతీయ స్థాయికి మన వస్త్ర పరిశ్రమ
విశ్వకర్మ యోజనతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అధికంగా లబ్ధి పొందుతున్నారని మోదీ తెలిపారు. ‘‘మన వస్త్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏడాది కాలంలో 20 లక్షల మందికిపైగా విశ్వకర్మ యోజనలో చేరారు. 8 లక్షల మంది నైపుణ్య శిక్షణ పొందారు’’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment