పండిట్, పటేల్ వేర్వేరు | Jawaharlal nehru, sardar vallabhbhai patel were different | Sakshi
Sakshi News home page

పండిట్, పటేల్ వేర్వేరు

Published Fri, Nov 15 2013 3:02 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

పండిట్, పటేల్ వేర్వేరు - Sakshi

పండిట్, పటేల్ వేర్వేరు

భారతదేశమనే నావను నడిపించగల సమర్థుడు నెహ్రూగారేనని భావించి నెహ్రూయే తన రాజకీయ వారసుడని గాంధీజీ నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. నరేంద్ర మోడీ ఈ గొప్ప సత్యాన్ని నేటి తరం భారతీయుల నుంచి దాచిపెట్టాడు.
 
 గుజరాత్ ముఖ్యమంత్రి నరేం ద్ర మోడీ ఇటీవల ఒక వివా దాన్ని రెచ్చగొట్టాడు. నెహ్రూ (నవంబర్ 14, 1889- మే 27, 1964) కాకుండా సర్దార్ వల్ల భాయ్ పటేల్ (అక్టోబర్ 31, 1875- డిసెంబర్ 15, 1950) మన మొదటి ప్రధాని అయి ఉంటే దేశం నేడు ఇలా ఉండేది కాదు, అద్భుతంగా ఉండేదన్నాడు. అద్భుతం కాదు, అల్ల కల్లోలంగా ఉండేదేమోనన్నది సెక్యులరిస్టుల అభిప్రా యం. 2014 ఎన్నికల్లో నెగ్గి, మోడీని ఢిల్లీ పీఠం ఎక్కించా లన్నది బీజేపీ వ్యూహం. అదే జరిగితే అంతకంటే దౌర్భా గ్యం మరొకటి ఉండదు. భారతీయులు గాంధీజీని జాతిపితగాను, నెహ్రూజీని నవభారత నిర్మాతగానూ చూస్తారు. గాంధీ, నెహ్రూలు లేని భారత్‌ను ఊహించుకోలేం.
 
 రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత్ నుంచి ‘క్విట్’ చేయించిన ఘనత గాంధీజీకి దక్కింది. స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ ఒక ఉజ్వలమైన పాత్ర పోషించారు. నెహ్రూ లౌకిక, ప్రజాస్వా మ్య భావనకు ప్రతీకగా నిలిచాడు. బూర్జువా రాజ్యాంగమే అయినా అది చారిత్రకంగా ఒక గొప్ప ముందడుగుగా, ఒక మంచి రాజ్యాంగాన్ని రచింపజేశాడు. కాంగ్రెసేతర మేథోసంపన్నులను అనేక మందిని రాజ్యాంగ రచనలో భాగస్వాములను చేశాడు. భారతదేశంలో గొప్ప మేధావి, దళిత వర్గానికి చెందిన అంబేద్కర్‌ను రాజ్యాంగ రచనా సంఘానికి సారథిని చేశాడు. హిందూ మహాసభ అధ్య క్షులు శ్యాంప్రసాద్ ముఖర్జీని కూడా ఈ రచనా వ్యాసంగం లో భాగస్వామిని చేశాడు. 1948లో గాంధీజీ హత్యానం తరం హిందూ మతోన్మాదాన్ని నిరసిస్తూ శ్యాంప్రసాద్ హిందూ మహాసభకు రాజీనామా చేశాడు.
 
 ఆరోగ్యకర స్పర్థ

 నెహ్రూ కూడా గాంధీజీతో విభేదించాడు. 1922లో చౌరీ చౌరా సంఘటన తర్వాత గాంధీజీ సహాయ నిరాకరణో ద్యమాన్ని ఆపేశాడు. దీనితో ఖిన్నులైన మోతీలాల్ లాంటి నేతలెందరో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి స్వరాజ్య పార్టీని స్థాపించుకున్నారు. గాంధీజీ నిర్ణయంతో విభేదించినప్ప టికీ నెహ్రూ గాంధీజీని అంటి పెట్టుకునే ఉన్నారు. కాం గ్రెస్ అధ్యక్ష స్థానానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య, సుభాష్ చంద్రబోస్ మధ్య తీవ్రమైన పోటీ జరిగినప్పుడు గాంధీజీ సీతారామయ్యకు మద్దతివ్వగా, నెహ్రూ బోసుకు మద్దతిచ్చాడు. సీతారామయ్య ఓటమితో ఖంగుతిన్న గాం ధీజీ బోసు ఏర్పరచిన వర్కింగ్ కమిటీని బహిష్కరిం చాడు. ఈ ఉదంతంలో గాంధీజీతో నెహ్రూ విభేదించాడు. బోసు కాంగ్రెస్‌ను వీడి ఫార్వర్డ్ బ్లాక్‌ను స్థాపించగా, నెహ్రూ కాంగ్రెస్‌లోనే కొనసాగాడు. గాంధీజీ కాంగ్రెస్ లోని మితవాద నాయకుల పట్ల అభిమానం ప్రకటిస్తే, కాంగ్రెస్‌లోని అతివాదులు, బయట ఉన్న అతివాదులు నెహ్రూ పట్ల గౌరవం ప్రకటించారు. భారతదేశమనే నావను నడిపించగల సమర్థుడు నెహ్రూగారేనని భావించి నెహ్రూయే తన రాజకీయ వారసుడని గాంధీజీ నిర్ద్వం ద్వంగా ప్రకటించాడు. నరేంద్ర మోడీ ఈ గొప్ప సత్యాన్ని నేటి తరం భారతీయుల నుంచి దాచిపెట్టాడు.
 
 నెహ్రూ గొప్ప దార్శనికుడు. గొప్ప భావుకుడు. సోవియెట్ అభిమాని. ప్రపంచంలో, ముఖ్యంగా ఆఫ్రికాలో జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటాలకు నెహ్రూయే మద్ద తు ప్రకటించాడు. పీఎల్‌ఓను గుర్తించి ఆదరించాడు. సూయజ్ కాలువను జాతీయం చేసిన ఈజిప్టు అధ్యక్షుడు నాజర్‌కు మద్దతు పలికాడు. స్పెయిన్ రిపబ్లికన్ పార్టీ పట్ల సౌహార్ద్రతను ప్రకటించడమే కాకుండా, అంతర్యుద్ధం కొనసాగుతూ ఉండగా స్పెయిన్ సిటీ బార్సిలోనా కెళ్లి రిప బ్లికన్‌ల మధ్య నిలిచాడు. తన భార్య కమల జబ్బు పడి స్విట్జర్లాండ్‌లో ఉన్నప్పుడు నెహ్రూ వెళ్లారు. ఇటలీ ఫాసిస్టు నియంత ముస్సోలినీ ఆహ్వానించినా నెహ్రూ తిరస్కరిం చాడు. సామ్రాజ్య కూటమి ఆటలు సాగకుండా అలీన విధానాన్ని రూపొందించడంలో మేటి పాత్ర వహించాడు.
 
 నవభారత నిర్మాత

 భారత పునర్నిర్మాణంలో నెహ్రూ కీలకపాత్ర పోషించాడు. సోవియెట్ అండతో, సోవియెట్ అనుభవంతో పారిశ్రామి కాభివృద్ధికి కీలకమైన భారీ పరిశ్రమల స్థాపనకు పూనుకు న్నాడు. వ్యవసాయరంగ ఉద్దీపనగా కీలకమైన భారీ నీటి పారుదల ప్రాజెక్టుల స్థాపనకు పూనుకొని ప్రాజెక్టులే ఆధు నిక దేవాలయాలన్న భావనకు శ్రీకారం చుట్టారు. భారతీ యుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అనేక సంస్థలను నెహ్రూ స్థాపించాడు. నెహ్రూకు బదులు పటేలు ప్రధాని అయి ఉంటే మన దేశం కూడా పాకి స్థాన్ లాగా హిందూత్వ దేశంగా పతనమై ఉండేది. నాడు ముస్లింలీగ్ మతతత్వ పార్టీ కాగా, నేడు బీజేపీ మతతత్వ పార్టీగా ఉంది. సంస్థానాలన్నీ భారత్‌లో విలీనమై భారత్ ఒక బలమైన దేశంగా రూపొందించడంలో పటేల్ పాత్రను విస్మరించలేం. కానీ నెహ్రూ తోడ్పాటుతోనే ఇదంతా జరిగింది. నైజాం నవా బును లొంగదీసు కోవడానికి జరిగిన పోలీసు చర్య మంచిదే గానీ, ఆ తర్వా త కమ్యూనిస్టులపై సాగించిన మారణకాండకు పటేలే బాధ్యుడన్న వాస్తవాన్ని విస్మరించలేం.
 
 ఈ సంస్థానాధీశుడు ముస్లిం కావటంవల్ల బీజేపీ సైనిక చర్యను బలపరుస్తున్నదేగానీ, సంస్థానాధీశుడు హిందువు అయినట్లయితే బీజేపీ వైఖరి ఇలా ఉండేదా? సెక్యులర్ జాతీయవాది అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర రెండవ కూర్పులో కొన్ని నగ్నసత్యాలను బయటపెట్టాడు. గాంధీ జీ చేపట్టిన చరిత్రాత్మక నిరాహారదీక్ష తర్వాత జనవరి 20వ తేదీన బిర్లా భవనం నుంచి సాయంకాలపు ప్రార్ధనా స్థలానికి గాంధీజీని మోసుకెళ్లారు. 79 ఏళ్ల గాంధీజీ ఈ దీక్షతో అంతగా బలహీనపడ్డాడు. ప్రార్థనా స్థలానికి కొంత దూరంలో ఒక బాంబుపేలింది. అది వేసిన వాడు పం జాబ్ కాందిశీకుడు మదన్‌లాల్. అతడు దొరికిపోయాడు. గాంధీజీని హత్య చేయాలన్న పెద్ద కుట్రలో భాగంగా ఇది జరిగింది. హోంమంత్రిగా ఉన్న పటేల్ కుట్రను దర్యాప్తు చేసి ఉంటే ఆ తర్వాత పదిరోజులకు గాంధీజీ హత్య జరి గేది కాదని ఆజాద్ రాశాడు.
 
 1937లో జరిగిన ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ ఏడు రాష్ట్రాల్లో గెలిచి మంత్రి వర్గాలను స్థాపించింది. ఆ వరసలో బొంబాయిలో కాంగ్రెస్ గెలిస్తే, ముఖ్య మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న సమస్య వస్తే అందుకు తగిన వ్యక్తి నారి మన్‌గా ఆజాద్ భావించారు. కానీ పటేల్ జోక్యంతో బీజే ఖేర్‌ను ముఖ్య మంత్రిగా చేశారు. నారిమన్ పార్సీ కాబట్టి అతన్ని తోసిపుచ్చి హిందువైన ఖేర్‌ను ముఖ్యమంత్రిని చేయడంలో పటేల్ పక్షపాతాన్ని చూపించాడని ఆజాద్ ఆరోపణ. ఒకటి నిజం. దేశాభిమానంలో నాటి మన పార్టీలు వేటికీ తీసిపోవు. కానీ నెహ్రూకు బదులు పటేల్ ప్రధాని అయి ఉన్నట్లయితే సెక్యులరిజం మను గడ వేరుగా ఉండేది.  
 
 చరిత్ర తెలియకనే...
 నెహ్రూ సెక్యులరిస్టు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యవాది మాత్రమే కాదు, భారతదేశంలో సోషలిజాన్ని కాంక్షించాడు. నెహ్రూ జాతీయ చరిత్ర మాత్రమే కాదు. ప్రపంచ చరిత్ర కూడా రాశాడు. చరిత్ర చీకటి కోణాలను అర్ధం చేసు కోవడానికి మార్క్సిజం ఇచ్చిన వెలుగు తనకు తోడ్పడిందని నెహ్రూ రాసుకు న్నాడు. పుట్టి పెరిగిన వాతావరణం వల్ల తాము నిఖార్సయిన సోషలిస్టులం కాలేకపోయానని తన పరిమితుల్ని అంగీకరించాడు. సోవియెట్ ప్రయోగం విఫలమైనా, సోషలిజందే అంతిమ విజయమని రాశాడు. తన గ్రంథం ముగిం పులో లెనిన్‌ను ఉటం కించాడు. ఎన్ని ఉన్నా నెహ్రూను పటేల్‌తో పోల్చడం అవి వేకం. నెహ్రూ, పటేళ్ల మధ్య హస్తి మశకమంత తేడా ఉంది. ఆధునిక భారతదేశ చరిత్ర తెలియని అజ్ఞానులు మాత్రమే ఆ ఇద్దరి మధ్య పోలిక తెస్తారు. వీరు చరిత్రను అధ్యయనం చేయడం తక్షణావసరం.    
 - ఎన్.శివరామిరెడ్డి
 మాజీ శాసన సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement