భారత మొట్టమొదటి హోం శాఖ మంత్రి, ఉక్కుమనిషి సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహా ఏర్పాటుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గురువారం నర్మదా నదీ తీరంలో భూమి పూజ నిర్వహిస్తారని ఆ విగ్రహ కమిటీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు.
సర్థార్ పటేల్ 138వ జయంతి సందర్బంగా ఆ విగ్రహ ఏర్పాటుకు గుజరాత్ ప్రభుత్వం నడుంబిగించిందని తెలిపారు. ఆ విగ్రహనికి స్టాట్యు ఆఫ్ యూనిటీగా నామకరణం చేసినట్లు వివరించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టిస్తుందన్నారు. దేశంలోని దాదాపు 7 లక్షల గ్రామాలకు చెందిన రైతులు ఆ విగ్రహం కోసం ఉక్కును విరాళంగా అందజేశారన్నారు. ఆ విగ్రహ ఏర్పాటులో అయా గ్రామల ప్రజల పాత్ర మరువలేనిదని డా. లక్ష్మణ్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.