హైదరాబాద్: దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ భారత్లో విలీనమయ్యేదికాదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం పటేల్ 139 జయంతి సందర్భంగా రాజ్నాథ్ హైదరాబాద్లో సమైక్యత పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా పటేల్కు ఘనంగా నివాళులు అర్పించారు.
రాజ్నాథ్ మాట్లాడుతూ.. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమైందని అన్నారు. పటేల్ లేకుంటే హైదరాబాద్ భారత్లో కలిసేదికాదని చెప్పారు. పటేల్ 70 రోజుల్లో 562 సంస్థానాలను భారత్లో విలీనం చేశారని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పరేడ్లో రాజ్నాథ్ పాల్గొన్నారు.
'పటేల్ లేకుంటే హైదరాబాద్ భారత్లో కలిసేదికాదు'
Published Fri, Oct 31 2014 4:00 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM
Advertisement