
బీజేపీది సమైక్య పరుగు కాదు విభజన పరుగు :హరికృష్ణ
దేశవ్యాప్తంగా బీజేపీది సమైక్యత పరుగు అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పార్టీ విభజన పరుగు చేస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నందమూరి హరికృష్ణ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనపై బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని తప్పు పట్టారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాని ఆయన బీజేపీ పార్టీ పెద్దలకు హితవు పలికారు. దేశాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో సర్థార్ పటేల్ అనుసరించిన వైఖరిని ఈ సందర్బంగా హరికృష్ణ గుర్తు చేశారు.
పటేల్ అనుసరించిన వైఖరిని ఆ పార్టీ నాయకులు అభినందిస్తు, మరో వైపు ఆంధ్రప్రదేశ్ విభజనకు మద్దతు ఇస్తామంటూ బీజేపీ న్యాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్థార్ వల్లబాయ్ పటేల్ 63వ వర్థంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సమైక్యత పరుగును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణపై విధంగా వ్యాఖ్యానించారు.