దేశ సమైక్యతలో పటేల్ పాత్ర అమోఘం:మోడీ
భారతదేశాన్ని సమైక్యం ఉంచేందుకు కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సర్థార్ వల్లబాయ్ పటేల్ అవిరాళా కృషి చేశారని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వెల్లడించారు. వల్లబాయ్ పటేల్ 63వ వర్థంతి సందర్భంగా ఆదివారం వడోదరాలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ యూనిటీని మోడీ జెండా ఊపి ప్రారంభించారు.అంతకు మందు ఆయన ప్రసంగిస్తూ... దేశాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో వల్లబాయ్ పటేల్ రైతులను భాగస్వాములుగా చేసిన తీరను ఈ సందర్భంగా మోడీ కొనియాడారు.
ఆయన వర్థంతి సందర్భంగా దేశ ప్రజల్లో సమైక్యతను పెంపొందించేందుకు రూపొందించిన పరుగుగా ఆయన అభివర్ణించారు. భారతీయుల ఆశలు, ఆశయాలకు తీరేందుకు ఉద్దేశించిన కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వెయ్యి ప్రాంతాల్లో రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తున్నట్లు మోడీ వెల్లడించారు. అలాగే అలహాబాద్లో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీని బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ ప్రారంభించారు. ముంబైలో ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ప్రారంభించారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొంది.