బీజేపీ శ్రేణులు గ్రేటర్‌లో ప్రతీ ఓటరును కలవాలి: దత్తాత్రేయ | meet in every greater voter | Sakshi
Sakshi News home page

బీజేపీ శ్రేణులు గ్రేటర్‌లో ప్రతీ ఓటరును కలవాలి: దత్తాత్రేయ

Published Tue, Jan 26 2016 4:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

బీజేపీ శ్రేణులు గ్రేటర్‌లో ప్రతీ ఓటరును కలవాలి: దత్తాత్రేయ

బీజేపీ శ్రేణులు గ్రేటర్‌లో ప్రతీ ఓటరును కలవాలి: దత్తాత్రేయ

బీజేపీ అభ్యర్థులకు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి సూచన
 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రతీ ఓటరును కలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ అభ్యర్థులతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రేటర్‌లో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉందని, అధికార టీఆర్‌ఎస్‌కు బలం లేక ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులను డివిజన్ల బాధ్యతలు అప్పగించి ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రచారం చేయాలని అభ్యర్థులకు దత్తాత్రేయ సూచించారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్ప ఆచరణలో అభివృద్ధిని, అమలును చూపించడం లేదని టీఆర్‌ఎస్‌ను కిషన్‌రెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement