కోల్కతా: ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్లను త్వరలో కెరీర్ కౌన్పిలింగ్ సెంటర్లుగా మార్చనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. సోమవారం కోల్కతాలో నిర్వహించిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్ విధానంలో సమూలమైన మార్పుల ద్వారా జాతీయ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లుగా మార్చనున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల సమాచారాన్ని సేకరించడం, ఉద్యోగవకాశాలు కల్పించే సంస్థలకు నిరుద్యోగుల సమాచారాన్నిచేరవేయడం ద్వారా ఉద్యోగవకాశాలు కల్పించడంలో ఈ కౌన్సెలింగ్ సెంటర్లు కీలక పాత్ర పోషించేలా చూస్తామన్నారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 978 ఎంప్లాయ్మెంట్ సెంటర్లు ఉన్నాయని వీటిని త్వరలోనే కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లుగా మార్చే ప్ర్రక్రియ
ప్రారంభమౌతుందన్నారు. తొలుత 100 మోడల్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పటు చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ కెరీర్ సర్వీస్ అనే మరో కార్యక్రమాన్నిన్ని కూడా ప్రారంభిస్తుందనీ, ఈ రెండు పథకాలకు కలిపి 800 కోట్ల రూపాయలు కెటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నూతన కా పథకాల ద్వారా ఈ ఆర్థీక సంవత్పరం చివరి నాటికి కోటి ఉద్యోగాలను కల్పించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. 'మేక్ ఇన్ ఇండియా', 'స్కిల్ ఇండియా' కేంద్రం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశాలుగా దత్తాత్రేయ తెలిపారు.