న్యూఢిల్లీ: చందాదారులు చనిపోయిన వారం రోజుల్లో వారి క్లెయిమ్‌లను పరిష్కరించేలా ప్రాంతీయ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీచేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) తెలిపింది. అలాగే ఉద్యోగి విరమణ పొందడానికి ముందు లేదా అదే రోజు అతని రిటైర్మెంట్ సెటిల్‌మెంట్‌ను పూర్తిచేయాలనీఆదేశించినట్లు పేర్కొంది. ప్రధాని ఆదేశాల మేరకు సంస్థ చేపట్టిన చర్యలను మంగళవారం కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సమీక్షించారు.
మరణ, విరమణ సెటిల్‌మెంట్లపై విస్పష్ట ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. సామాజిక మాధ్యమల్లో వెలిబుచ్చే సమస్యలపై సత్వరం స్పందించాలని కూడా నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్యోగుల భవిష్య నిధి చట్టం-1952 64వ దినోత్సవాన్ని మంగళవారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ...సంస్థ సాధించిన విజయాలు, భవిష్యత్ మార్గసూచిపై అధికారులతో కలిసి సమీక్షించారు.
వారం రోజుల్లో పీఎఫ్ మరణ క్లెయిమ్‌లకు పరిష్కారం
Published Wed, Nov 2 2016 3:23 AM | Last Updated on Wed, Sep 5 2018 8:20 PM
Advertisement