క్లెయిమ్‌ల పరిష్కారం సులభతరం
ఇన్సూరెన్స్ ప్రయోజనాలూ పొందొచ్చు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్‌లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు.
వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఏడు కోట్లకు పైగా సభ్యులకు బ్యాంక్‌ల మాదిరి సేవలు అందించాలన్నది ఈపీఎఫ్‌వో ఆలోచనగా పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో తన ఐటీ సదుపాయాలను మెరుగుపరుచుకుంటోందని కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే పీఎఫ్ ప్రయోజనాలు, బీమా ప్రయోజనాలను ఏటీఎంల నుంచే పొందొచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment