సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా రోజు రోజుకూ పెరుగుతోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నిక ల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కేజ్రీవాల్ తన వైఖరి మార్చుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు.