నిర్మల్‌లో ఈఎస్‌ఐ ఏర్పాటు చేయండి
దత్తాత్రేయను కోరిన ఇంద్రకరణ్
సాక్షి, న్యూఢిల్లీ: నిర్మల్‌లో భారీగా ఉన్న బీడీ కార్మికుల్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. బుధవారం ఉదయం కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలసిన ఇంద్రకరణ్‌రెడ్డి ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు కు వినతిపత్రాన్ని సమర్పించారు. నిర్మల్ లో ఏరియా ఆస్పత్రి భవనం ఖాళీగా ఉందని లేబర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆ భవనాన్ని తమ అధీనంలోకి తీసుకొని అక్కడ ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పా టుకు చర్యలు తీసుకోవాలని దత్తా త్రేయను కోరారు. అలాగే నిర్మల్‌లో పీఎఫ్ రీజినల్ ఆఫీసు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ సానుకూలంగా స్పందించి నిర్మల్‌లో ఆస్పత్రి, పీఎఫ్ రీజినల్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రామగుండంలో 100 పడకల ఆస్పత్రిని, రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో కూడా ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్టు దత్తాత్రేయ తెలిపారు.