'జాత్యహంకార దాడులు సహించరానివి'
హైదరాబాద్: అమెరికాలో జాత్యహంకార దాడులు, తెలుగు విద్యార్థి హత్య సహించరానివని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. జాతి వివక్ష దాడులను అక్కడి ప్రభుత్వం అరికట్టాలని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ.. అహంకార దాడుల విషయంలో కేంద్రం అమెరికాతో మాట్లాడుతుందని, ఈ విషయంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఈఎస్‌ఐ సేవల విస్తరణకు సిద్ధంగా ఉన్నామని దత్తాత్రేయ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటికి కావాల్సిన భూములు ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూములు ఇవ్వకపోవడం మూలంగా ఈఎస్‌ఐ సేవల విస్తరణలో కాలయాపన జరుగుతోందని, గోషామహల్‌లో వంద పడకల ఆస్పత్రి కోసం శంకుస్థాపన చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చెయ్యకపోవడంతో ఆలస్యం అవుతోందని తెలిపారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు నిధులు ఇవ్వవడానికి సిద్ధంగా ఉన్నామని, కనీసం అద్దె భవనాలు ఇచ్చినా ఆస్పత్రులు ప్రారంభిస్తామని అన్నారు. ప్రతీ కార్మికునికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.