ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ వాటిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ప్రజలను సన్మార్గం వైపు మళ్లించేలా చినజీయర్ స్వామి ఆధ్యాత్మిక ప్రసంగాలు దోహదం చేస్తున్నాయని, చాలా సరళమైన భాషలో ఆయన చేసే అనుగ్రహ భాషణాలు భక్తిప్రపత్తులతో కూడుకున్న విన్యాసాలని కొనియాడారు.