
ఘనంగా దత్తాత్రేయ కుమార్తె నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి నిశ్చితార్థం ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.జనార్దన్‌రెడ్డి కుమారుడు డాక్టర్ జిగ్నేష్‌తో శనివారం రాత్రి హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఘనంగా జరిగింది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంలాల్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నారుుని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, బి.నర్సయ్యగౌడ్, జేఏసీ చైర్మన్ కోదండరామ్, హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తదితరులు పాల్గొన్నారు.