![ఢిల్లీ బయలుదేరనున్న దత్తన్న - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51401043569_625x300_4.jpg.webp?itok=R_yfishy)
ఢిల్లీ బయలుదేరనున్న దత్తన్న
హైదరాబాద్: నరేంద్ర మోడీ కేబినెట్లో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు బర్త్ ఖరారైందని సమాచారం. ఆదివారం న్యూఢిల్లీలో ఉండాలని ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ఉదయం దత్తాత్రేయకు ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం దత్తత్రేయ న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఆదివారం మోడీ తన కేబినెట్ను విస్తరించనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎంపీ సీటును బీజేపీ కేవసం చేసుకుంది.
అది సికింద్రాబాద్ నుంచి బండారు దత్తత్రేయ గెలుపొందిన విషయం విదితమే. అలాగే బీజేపీ పొత్తులో బరిలో దిగిన టీడీపీ అభ్యర్థుల్లో కూడా ఒక్కరే అది సీహెచ్ మల్లారెడ్డి మల్కాజ్గిరి నుంచి గెలుపొందారు. మల్లారెడ్డికి మోడీ కేబినెట్ విస్తరణలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయిన మీడియాలో ఇటీవల కథనాలు వెల్లువడ్డాయి. అయితే మోడీ మాత్రం బండారు దత్తాత్రేయ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. అదికాక బండారు దత్తాత్రేయకు గతంలో కేంద్ర సహాయమంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఉన్న సంగతి తెలిసిందే.