మోదీకి రానున్నవి గడ్డు రోజులు | Bihar election results: On reforms front, Narendra Modi's life likely to get a lot tougher | Sakshi

మోదీకి రానున్నవి గడ్డు రోజులు

Published Mon, Nov 9 2015 6:08 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

మోదీకి రానున్నవి గడ్డు రోజులు - Sakshi

మోదీకి రానున్నవి గడ్డు రోజులు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పొలిటికల్ థ్రిల్లర్‌లా సాగాయి. ముందస్తు అంచనాలను తలకిందులు చేశాయి. తుది తీర్పు ప్రజల మనోగతానికి అద్దం పట్టాయి.

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పొలిటికల్ థ్రిల్లర్‌లా సాగాయి. ముందస్తు అంచనాలను తలకిందులు చేశాయి. తుది తీర్పు ప్రజల మనోగతానికి అద్దం పట్టాయి. సచ్చీలత, సుస్థిరత, సుపరపాలనుకు పట్టంగట్టాయి. అసహనానికి సహనం నూరిపోశాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి మధ్య హోరాహోరిగా జరిగిన ప్రచారం ఫలితాల్లో కూడా ప్రతిఫలిస్తుందని ఒకటి, రెండు మినహా అన్ని సర్వేలు చాటి చెప్పాయి.

దాదాపు అన్ని వర్గాల ప్రజలు నితీష్ నాయకత్వాన్ని, లాలూ అండదండలను కోరుకున్నారనే విషయం తీర్పుతో స్పష్టమైంది. యాదవులు, ముస్లింలు ఎక్కువగా ఉన్న సీమాంచల్‌లో దాదాపు 75 శాతం ఓట్లు మహా కూటమికి పడ్డాయి. మొత్తం 70 శాతంకుపైగా బీసీలు, ఓబీసీలు మహాకూటమికే ఓటేశారని ఫలితాల తీరు తెలియజేస్తోంది. 80 శాతం వరకు ముస్లింలు, 45 శాతం మహిళలు, 41 శాతం యువకులు మహా కూటమికే మద్దతు పలికారు.

దాద్రీ నుంచి ఢిల్లీ వరకు పెరిగిపోయిన అసహన సంఘటనలు బీజేపీ కూటమిపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. నమ్ముకున్న అగ్రవర్ణాలు, యువత, కొత్త ఓటర్ల నుంచి కూడా ఆశించిన మద్దతు లభించలేదు.  అభివృద్ధి మంత్రం పేరిట ఆర్థికంగా వెనకబడిన వివిధ వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాని మోదీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. తొలుత అటూ ఇటూ ఊగిసలాడిన ఆర్థికంగా వెనకబడిన వర్గం చివరకు సుస్థిర పాలన నినాదానికే కట్టుబడి ఓటేశారు. ఒకప్పుడు భూస్వాముల ప్రైవేటు సైన్యం హింసాకాండలో నలిగిపోయిన కులాలు కూడా సుస్థిర పరిపాలనకే మొగ్గుచూపాయి.


హిందూ అతివాద శ క్తుల ఎజెండాను వ్యతిరేకిస్తున్న ఉదారవాదులు, హేతువాదులు, సామ్యవాదులు కూడా కలసికట్టుగా నితీస్ కూటిమివైపే నిలబడ్డారు. వామపక్షాల కూటమి ఎన్నికల బరిలో ఉన్నప్పటికి పెద్దగా ప్రభావం చూపలేదు. దళిల వర్గానికే చెందిన జితన్ మాంజీ సొంత పార్టీ పెట్టి ఏకంగా 40 సీట్లకు పోటీ చేసినా నితీష్ కూటమి విజయపథాన్ని అడ్డుకోలేక పోయారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనకు ఇది రిఫరెండం అయినా, కాకపోయిన ఆయన వ్యక్తిగత ప్రతిష్టను మాత్రం బిహార్ ఎన్నికల ఫలితాలు దెబ్బతీశాయి. కేంద్రంలో ప్రతిపక్షాల పునరుజ్జీవనానికి బీహార్ ఎన్నికల తీర్పు దోహదపడుతుందని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement