'చంద్రబాబును అహ్వానించడానికి వచ్చా'
Published Fri, Sep 22 2017 2:01 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఆలయ పరిసరాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వచ్ఛ సేవ కార్యక్రమాన్ని చాలా బాగా పాటిస్తున్నారని అనిపిస్తోంది.
ప్రతి ఏడాది దసరా అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించి అలయ్-బలయ్ కార్యక్రమానికి చంద్రబాబునాయుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి విజయవాడకు వచ్చినట్టు తెలిపారు. ఈ రోజు సాయంత్రం సీఎంతో భేటీ అవుతన్నానన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర స్నేహ భావంతో ముందెకెళ్లాలని కోరుకుంటున్నానని అన్నారు.
Advertisement
Advertisement