ఉద్యమకారులతో చర్చలు జరపాలి
ఉద్యోగాలు కల్పిస్తామన్న టీఆర్‌ఎస్ మాట నిలబెట్టుకోవాలి: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: నిరుద్యోగ యువత కు ఉద్యోగాలు కల్పిస్తా మని ఇచ్చిన మాటను టీఆర్‌ఎస్ నిలబెట్టుకోవా లని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఉద్యమ కారులతో ప్రభుత్వం సంప్రదింపు లు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ.. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం ప్రస్తుత యూపీ ఎన్నికల్లోనూ, తెలంగాణలో రాను న్న ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకందారులకు జాతీయ సహకారాభి వృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రుణాలు అందించేందుకు వీలుగా సంస్థ సీఎండీ వసు ధా మిశ్రాతో చర్చించినట్లు దత్తాత్రేయ తెలి పారు. పదవీ విరమణ పొందిన ఈఎస్‌ఐ లబ్ధిదారులకూ కుటుంబానికి రూ.15 లక్ష లకు మించకుండా వైద్య సదు పాయాలు కల్పించనున్నట్టు తెలి పారు.
తెలంగాణలో 15, ఏపీలో 26 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు నిర్మిం చనున్నట్టు తెలిపారు. ఏపీలో కంచికచర్ల, చిల్లకూరు, తోడండి, తుని, హనుమంతవాక, శ్రీకాకుళం, రాజాం, అనకాపల్లి, గాడిమొగ, ఒంగోలు, కావలి, సత్యవేడు, కుప్పం, పీలేరు, జమ్మలమడుగు, పర్వాడ, తిరుమల, పుట్టపర్తి, గంగవరం, పలమనేరు, పూతలపట్టు, తావనపాలెం, మద్దిపాడు, మంగళగిరి ప్రాంతాల్లో డిస్పె న్సరీలు ఏర్పాటుచేయ నున్నట్టు తెలిపారు. తెలంగాణలో కేటీటీపీ చెల్పూరు, తాండూ రు, కరీంనగర్, దేవాపూర్, దౌల్తాబాద్, మల్లెల చెర్వు, ఖమ్మం, సూర్యాపేట, మహే శ్వరం, ఘట్‌కేసర్, కోదాడ, సిద్దిపేట, ఆమన గల్లు, కల్వకుర్తి, ధర్మసాగర్ ప్రాంతాల్లో ఏర్పాటుచేయనున్నట్టు వివరించారు.