సాక్షి, హైదరాబాద్: జర్మనీలోని ఒట్టో–వాన్–జ్యూరిక్ యూనివర్సిటీలో చదువుకునేందుకు వెళ్లి తీవ్ర మానసిక సమస్య తో బాధపడుతూ గల్లంతైన హైదరాబాద్‌కు చెందిన సాయి రాహుల్ అనే యువకుడిని భారత్ రప్పించేలా చొరవ చూపాలని కోరుతూ మాజీ ఎంపీ దత్తాత్రేయ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. సాయి సోదరి హిమబిందు మంగళవారం దత్తాత్రేయను కలిసి సోదరుడి పరిస్థితి వివరించి కన్నీ టి పర్యంతమయ్యారు. దీంతో ఆ యువకుడి జాడ కనిపెట్టి హైదరాబాద్‌కు రప్పించేలా చొరవ చూపాల్సిందిగా దత్తాత్రేయ లేఖలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment