కష్టపడి గెలవడం నరేంద్ర నుంచి నేర్చుకోవాలి | Death anniversary program | Sakshi
Sakshi News home page

కష్టపడి గెలవడం నరేంద్ర నుంచి నేర్చుకోవాలి

Published Sun, Apr 10 2016 3:03 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

కష్టపడి గెలవడం నరేంద్ర నుంచి నేర్చుకోవాలి - Sakshi

కష్టపడి గెలవడం నరేంద్ర నుంచి నేర్చుకోవాలి

కేంద్ర మాజీ మంత్రి వర్ధంతి కార్యక్రమంలో దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో కష్టపడి ఎలా గెలవాలో ఆలె నరేంద్రను చూసి నేర్చుకోవాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర వర్థంతి కార్యక్రమం శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగింది. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ఆలె నరేంద్ర కుటుంబసభ్యులు, పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌తో, బీజేపీతో నరేంద్రకు ఉన్న అనుబంధం, పార్టీ కార్యకర్తల కోసం ఆయన చేసిన కృషిని నేతలు గుర్తుచేసుకున్నారు.

హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఆలె నరేంద్ర ఆద్యుడని దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కొనియాడారు. సహజంగానే బీజేపీకి వ్యతిరేక ఓట్లు ఎక్కువగా ఉంటాయని... ఈ పరిస్థితిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలవాలంటే కష్టపడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement