Ale narendra
-
కష్టపడి గెలవడం నరేంద్ర నుంచి నేర్చుకోవాలి
కేంద్ర మాజీ మంత్రి వర్ధంతి కార్యక్రమంలో దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో కష్టపడి ఎలా గెలవాలో ఆలె నరేంద్రను చూసి నేర్చుకోవాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర వర్థంతి కార్యక్రమం శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగింది. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ఆలె నరేంద్ర కుటుంబసభ్యులు, పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్తో, బీజేపీతో నరేంద్రకు ఉన్న అనుబంధం, పార్టీ కార్యకర్తల కోసం ఆయన చేసిన కృషిని నేతలు గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఆలె నరేంద్ర ఆద్యుడని దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కొనియాడారు. సహజంగానే బీజేపీకి వ్యతిరేక ఓట్లు ఎక్కువగా ఉంటాయని... ఈ పరిస్థితిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలవాలంటే కష్టపడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. -
అశ్రునయనాల మధ్య ఆలె నరేంద్ర అంతిమయాత్ర
భారీగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు హైదరాబాద్, న్యూస్‌లైన్: కేంద్ర మాజీమంత్రి, బీజేపీ అగ్ర నాయకుడు ఆలే నరేంద్ర అంత్యక్రియలు గురువారం సాయుంత్రం హైదరాబాద్ అంబర్‌పేటలోని హిందూ శ్మశానవాటికలో అశ్రునయునాల వుధ్య జరిగాయి. వివిధ పార్టీల నాయకులు, కార్తకర్తలు, అభిమానులు ఉదయుం గౌలిపురాలోని ఆయున నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా నివాళి అర్పించారు. ఉదయం 11 గంటలకు పూలతో అలంకరించిన స్వర్గపురి వాహనంలో నరేంద్ర అంతిమయాత్ర గౌలిపురా నుంచి బయల్దేరింది. ఛత్రినాక, లాల్‌దర్వాజా, శాలిబండ, చార్మినార్, మదీనాల మీదుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంది. దారి పొడవునా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు వేదికలను ఏర్పాటు చేసి పూలతో నివాళులర్పించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నరేంద్ర పార్థివదేహాన్ని ర్యాలీగా అంబర్‌పేట శ్మశానవాటిక వరకు తీసుకువచ్చారు. చితికి నరేంద్ర పెద్దకువూరుడు ఆలె భాస్కర్ నిప్పంటించారు. అంతకువుుందు, బీజేపీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ఎంపీలు కేశవరావు, రాపోలు ఆనందభాస్కర్ తదితరులు నరేంద్ర పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. నరేంద్ర కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియుజేశారు. -
టైగర్ నరేంద్ర ఇక లేరు
-
టైగర్ నరేంద్ర ఇక లేరు
* అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన బీజేపీ నేత * జన్‌సంఘ్, బీజేపీ బలోపేతానికి విశేష కృషి.. కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా సేవలు * ఆలె నరేంద్ర మృతికి జగన్ సహా పలువురు ప్రముఖుల సంతాపం హైదరాబాద్, న్యూస్‌లైన్: టైగర్ నరేంద్రగా సుపరిచితులైన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆలె నరేంద్ర (68) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇక్కడి మోజాంజహి మార్కెట్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 4.15 గంటలకు మృతి చెందారు. నరేంద్ర పార్థివదేహాన్ని గౌలిపురాలోని ఆయన గృహానికి తరలించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం గురువారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు అంబర్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నరేంద్రకు భార్య లలిత, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు భాస్కర్ రాజ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. బీజేవైఎం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడైన రెండో కుమారుడు జితేంద్ర గౌలిపురా డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. పాతబస్తీ గౌలిపురాలో ఆలె రామలింగం, పుష్పవతి దంపతులకు 1946 ఆగస్టు 21న నరేంద్ర జన్మించారు. నగరంలో జన్‌సంఘ్, బీజేపీ బలోపేతానికి కృషిచేశారు. 17 ఏళ్ల వయసులోనే జన్‌సంఘ్‌లో చేరి, కార్య నిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. 1980లో బీజేపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి రాష్ట్ర కార్యదర్శిగా, కోశాధికారిగా, ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 1980లో హైదరాబాద్ నుంచి, 1983లో చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1983లో జరిగిన ఉప ఎన్నికల్లో హిమాయత్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. 1985లో కూడా హిమాయత్‌నగర్ నుంచి గెలుపొందారు. 1989లో ఓటమి పాలైన ఆయన 1992 ఉప ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో మెదక్ లోక్‌సభ స్థానంలో ఓడిపోయి, 1999లో అదే స్థానంలో 26 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ స్పష్టమైన వైఖరిని వెల్లడించకపోవడంతో 2001లో పార్టీని వీడి తెలంగాణ సాధన సమితిని స్థాపించారు. 2002లో దానిని టీఆర్ఎస్లో విలీనం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి 1,25,000 భారీ మెజార్టీతో గెలుపొందారు. యూపీఏ ప్రభుత్వంలో 2004 మేలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.. 2006 ఆగస్టు 24 వరకు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగిన ఆయన కాంగ్రెస్‌తో విభేదించి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2011లో తిరిగి బీజేపీలో చేరారు. 1980లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఐడీపీఎల్, ఆల్విన్ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు. మహోన్నతుడు నరేంద్ర : దత్తాత్రేయ నరేంద్ర మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ గౌలిపురాలోని నరేంద్ర నివాసానికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. భాగ్యనగరంలో బీజేపీకి పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి నరేంద్ర అని, ఆయన మరణం దేశానికి తీరని లోటని దత్తాత్రేయ అన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా దేశానికి విశిష్ట సేవలందించారని కొనియాడారు. నరేంద్ర మృతికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. నరేంద్ర మృతికి జగన్ సంతాపం కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో పోరాటపటిమ కలిగిన ఒక నేతను రాష్ట్రం కోల్పోయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికోద్యమ నేతగా కార్మికుల సంక్షేమానికి పాటుపడ్డారని, ఎమ్మెల్యే, ఎంపీగా ప్రజా సేవ చేశారని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. నరేంద్ర కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
ఆలె నరేంద్ర - విలక్షణం, వివాదాస్పదం
బుధవారం నాంపల్లి కేర్ ఆస్పత్రిలో మరణించిన ఆలె నరేంద్ర రాజకీయం విలక్షణమే కాదు. వివాదాస్పదం కూడా. ఆయన తెలంగాణలో బిజెపి ఎదుగుదలలో ప్రధాన పాత్ర వహించారు. కానీ బిజెపి కార్యకర్తలు ఆయన వేరే పార్టీలో చేరినప్పుడు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆయన జీవితమంతా కాంగ్రెస్ ను వ్యతిరేకించారు. కానీ చివరికి కాంగ్రెస్ హయాంలోనే ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఆలె నరేంద్ర 1980 వ దశకపు రాజకీయాలకు ప్రతినిధి. అప్పట్లో పాత బస్తీ మత కల్లోలాలతో కుతకుతలాడుతూండేది. ఆ రోజుల్లో ఒక వర్గానికి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ నాయకత్వం వహిస్తే, ప్రత్యర్థి వర్గానికి టైగర్ నరేంద్ర నాయకుడిగా నిలిచారు. అటు ఒవైసీకి, ఇటు నరేంద్రకు రాబిన్ హుడ్ ఇమేజీ ఉండేది. పాతబస్తీలోనే ఇల్లు ఉండి, అక్కడే నివసించిన చాలా తక్కువ మంది నాయకుల్లో నరేంద్ర ఒకరు. కానీ నరేంద్ర ఏ నాడూ పాత బస్తీ నుంచి గెలుపొందలేదు. 1983 ఎన్నికల్లో ఆయన చంద్రాయణ గుట్ట నుంచి పోటీకి దిగారు. ఆయనకి ప్రత్యర్థిగా మజ్లిస్ నేత అమానుల్లా ఖాన్ బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్యా హోరాహోరీ జరిగింది. ఒకానొక సందర్భంలో ఇరువురు నేతలు పరస్పరం కాల్పులు కూడా జరుపుకున్నారు. హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనాన్ని సామూహికంగా నిర్వహించే పద్ధతిని పాపులర్ చేయడంలోనూ ఆయన పాత్ర ఉంది. కొన్ని దశాబ్దాల పాటు ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్ గా కూడా పనిచేశారు. ఈ సంఘటన తరువాత నరేంద్ర రాజకీయం పాతబస్తీ కేంద్రంగా సాగినా, ఆయన ఎన్నికల్లో గెలిచింది మాత్రం కొత్త బస్తీనుంచే. నరేంద్ర రాజకీయంగా జెయింట్ కిల్లరే. ఆయన టీడీపీ సీనియర్ నేత ఉపేంద్రను ఒక సారి ఓడించారు. మెదక్ ఎంపీగా పోటీ చేసి తలపండిన కాంగ్రెస్ నేత బాగారెడ్డిని ఓడించారు. బిజెపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తరఫు నుంచి చట్ట సభలకు ఎన్నికయ్యారు. కానీ మనసు మాత్రం ఆరెస్సెస్ తో నే ఉండేది. ఇతర పార్టీల్లో ఉంటున్నప్పటికీ ఆయన ఆరెస్సెస్ కార్యక్రమాలకు యూనిఫారం ధరించి మరీ హాజరయ్యేవారు. తిరిగి ఆయన బిజెపిలో చేరేనాటికే ఆరోగ్యం బాగా క్షీణించింది. గత దశబ్దంగా ఆయన నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆయన కుమారుడు జితేందర్ గౌలీపురా కార్పొరేటర్. ఇంకో కుమారుడు ఆలె భాస్కర రాజ్ హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. ఆయన సోదరుడు శ్యామ్ కుమార్ ఆరెస్సెస్ తెలంగాణ ప్రాంతానికి ప్రధాన ప్రచారక్ గా ఉంటున్నారు. నరేంద్ర మృతితో ఎనభైయవ దశకంలోని పాతబస్తీ రాజకీయాల ప్రధాన పాత్రధారులు సాలార్ సలాహుద్దీన్ ఒవైసీ, అమానుల్లా ఖాన్, నరేంద్రలు ఇప్పుడు చరిత్ర పేజీల్లోకి వెళ్లిపోయినట్టయింది. -
'టైగర్' ఆలే నరేంద్ర కన్నుమూత
-
'టైగర్' ఆలే నరేంద్ర కన్నుమూత
బీజేపీ సీనియర్ నేత ఆలే నరేంద్ర తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా నరేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. రాష్ట్ర రాజకీయాల్లో 'టైగర్' పేరుతో సుపరిచితులు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని బంధువులు తెలిపారు. ఆయనకు భార్య లలిత, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తే ఉన్నారు. 1946 ఆగస్టు 21 తేదిన హైదరాబాద్ పాతబస్తిలోని ఆలియాబాద్ జన్మించారు. ఆయన కుమారుడు ఆలే జితేంద్ర జీహెచ్ ఎంసీ కార్పోరేటర్ గా సేవలందిస్తున్నారు. హిమయత్ నగర్ శాసన సభకు తొలిసారి ఎన్నికైన నరేంద్ర బీజేపీలో పలు పదవులను చేపట్టారు. మొత్తం మూడుసార్లు హిమాయత్ నగర్ నుంచి గెలుపొందారు. ప్రత్యేక రాస్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ సాధన సమితి పేరుతో పార్టీని నిర్వహించారు. ఆతర్వాత కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ సాధన సమితిని విలీనం చేశారు. నకిలీ పాస్ట్ పోర్టు కుంభకోణం కేసును సాకుగా చూపించి 2007లో నరేంద్రను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆతర్వాత 2011 జూన్ 27 తేదిన తిరిగి బీజేపీలో చేరారు. యూపీఏ-1 ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ది శాఖామంత్రిగా సేవలందించారు. 13, 14వ లోకసభలో మెదక్ లోకసభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. పాతబస్తీ అనే చిత్రంలో విలన్ గా కనిపించారు. ఆలే నరేంద్ర మృతికి బీజేపీ నేతలు, సీనియర్ రాజకీయ వేత్తలు, తెలంగాణవాదులు సంతాపం ప్రకటించారు.