అశ్రునయనాల మధ్య ఆలె నరేంద్ర అంతిమయాత్ర
భారీగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: కేంద్ర మాజీమంత్రి, బీజేపీ అగ్ర నాయకుడు ఆలే నరేంద్ర అంత్యక్రియలు గురువారం సాయుంత్రం హైదరాబాద్ అంబర్‌పేటలోని హిందూ శ్మశానవాటికలో అశ్రునయునాల వుధ్య జరిగాయి. వివిధ పార్టీల నాయకులు, కార్తకర్తలు, అభిమానులు ఉదయుం గౌలిపురాలోని ఆయున నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా నివాళి అర్పించారు. ఉదయం 11 గంటలకు పూలతో అలంకరించిన స్వర్గపురి వాహనంలో నరేంద్ర అంతిమయాత్ర గౌలిపురా నుంచి బయల్దేరింది. ఛత్రినాక, లాల్‌దర్వాజా, శాలిబండ, చార్మినార్, మదీనాల మీదుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంది.
దారి పొడవునా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు వేదికలను ఏర్పాటు చేసి పూలతో నివాళులర్పించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నరేంద్ర పార్థివదేహాన్ని ర్యాలీగా అంబర్‌పేట శ్మశానవాటిక వరకు తీసుకువచ్చారు. చితికి నరేంద్ర పెద్దకువూరుడు ఆలె భాస్కర్ నిప్పంటించారు. అంతకువుుందు, బీజేపీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ఎంపీలు కేశవరావు, రాపోలు ఆనందభాస్కర్ తదితరులు నరేంద్ర పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. నరేంద్ర కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియుజేశారు.