Indian Burial Ground
-
అశ్రునయనాల మధ్య ఆలె నరేంద్ర అంతిమయాత్ర
భారీగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు హైదరాబాద్, న్యూస్‌లైన్: కేంద్ర మాజీమంత్రి, బీజేపీ అగ్ర నాయకుడు ఆలే నరేంద్ర అంత్యక్రియలు గురువారం సాయుంత్రం హైదరాబాద్ అంబర్‌పేటలోని హిందూ శ్మశానవాటికలో అశ్రునయునాల వుధ్య జరిగాయి. వివిధ పార్టీల నాయకులు, కార్తకర్తలు, అభిమానులు ఉదయుం గౌలిపురాలోని ఆయున నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా నివాళి అర్పించారు. ఉదయం 11 గంటలకు పూలతో అలంకరించిన స్వర్గపురి వాహనంలో నరేంద్ర అంతిమయాత్ర గౌలిపురా నుంచి బయల్దేరింది. ఛత్రినాక, లాల్‌దర్వాజా, శాలిబండ, చార్మినార్, మదీనాల మీదుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంది. దారి పొడవునా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు వేదికలను ఏర్పాటు చేసి పూలతో నివాళులర్పించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నరేంద్ర పార్థివదేహాన్ని ర్యాలీగా అంబర్‌పేట శ్మశానవాటిక వరకు తీసుకువచ్చారు. చితికి నరేంద్ర పెద్దకువూరుడు ఆలె భాస్కర్ నిప్పంటించారు. అంతకువుుందు, బీజేపీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ఎంపీలు కేశవరావు, రాపోలు ఆనందభాస్కర్ తదితరులు నరేంద్ర పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. నరేంద్ర కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియుజేశారు. -
సీఎన్జీకి బీఎంసీ ఓకే..
అంత్యక్రియలకు గ్యాస్ వినియోగించాలని నిర్ణయం సగం ఖర్చుతో కార్యక్రమం పూర్తి పైపులైన్లకు దగ్గరగా ఉన్న శ్మశాన వాటికలకు అనుసంధానం ఆర్థిక బడ్జెట్లో నిధులు మంజూరు సాక్షి, ముంబై: శ్మశాన వాటికలో అంత్యక్రియలకు గ్యాస్ ద్వారా నిర్వహించాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. విడతలవారీగా అన్ని హిందూ శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేయాలని, అందుకు ఆర్థిక బడ్జెట్లో నిధులు కూడా మంజూరు చేసింది. కట్టెల ద్వారా దహనకాండ చేయడంవల్ల పర్యావరణానికి హాని, కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో గ్యాస్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. ముంబైలో దాదాపు 35 శ్మశాన వాటికలు ఉన్నాయి. సాధారణంగా ఒక్కో శవానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే సుమారు 300 కేజీల కట్టెలు అవసరమవుతాయి. అందుకు బీఎంసీ శ్మశాన వాటికలో రూ.1,890 ఖర్చవుతాయి. అదే ప్రైవేటు శ్మశాన వాటిలో రూ.2,090 చెల్లించాల్సి ఉంటుంది. కాగా శవం తాలూకు కుటుంబం ఆర్థిక పరిస్థితిని బట్టి ఇందులో కొంత శాతం రుసుం వారి నుంచి వసూలు చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు మాత్రం ఉచితంగానే అంత్యక్రియలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ భారాన్ని బీఎంసీ స్వయంగా భరిస్తోంది. అదేవిధంగా ఒక్కో శవానికి విద్యుత్ ద్వారా దహనకాండకు రూ.700 ఖర్చుకాగా సీఎన్జీ ద్వారా రూ.630 ఖర్చవుతోంది. కట్టెలతో పోలిస్తే గ్యాస్ ద్వారా దహన క్రియలు పూర్తిచేయడం బీఎంసీకి ఎంతో గిట్టుబాటు అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గ్యాస్ ద్వారా అంత్యక్రియలు పూర్తిచేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో మహానగర్ గ్యాస్ పైపులైన్లు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయో ఆ సమీపంలో ఉన్న శ్మశాన వాటికలను గ్యాస్‌తో అనుసంధానించాలని యోచిస్తోంది. ప్రస్తుతం గ్యాస్ పైపులైన్లకు వంద మీటర్ల లోపు ఉన్న తొమ్మిది, వంద మీటర్ల తర్వాత ఉన్న 11 శ్మశాన వాటికలను గ్యాస్‌తో అనుసంధించాలని బీఎంసీ పరిపాలన విభాగం నిర్ణయించింది.