Death anniversary program
-
నేడు సీనియర్ ఎన్టీఆర్ 27వ వర్ధంతి
-
ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్
-
మరపురాని జ్ఞాపకం డాక్టర్ ఈసీ గంగిరెడ్డి
సాక్షి, పులివెందుల: దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి ఆదివారం పులివెందులలో నిర్వహించారు. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో ఉన్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఘాట్ వద్ద ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, ఇతర వైఎస్ కుటుంబీకులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. సంస్మరణ సభ అనంతరం మరపురాని జ్ఞాపకం డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభకు వైఎస్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. సంస్మరణ సభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి క్రెడిబులిటీ ఉన్న వ్యక్తి అని అన్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. పేదల మనసు గెలుచుకున్న వ్యక్తి' అంటూ కొనియాడారు. పేదల డాక్టర్‌గా గుర్తింపు దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పేదల డాక్టర్‌గా పులివెందుల ప్రాంతంలో గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ఈయన చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్ 20వ తేదీన ఇసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండో సంతానంగా వేముల మండలం గొల్లలగూడూరులో ఇ.సి. గంగిరెడ్డి జన్మించారు. 1 నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్సీఎం స్కూలు, 6 నుంచి 8వ తరగతి వరకు పులివెందులలోని జెడ్పీ హైస్కూలులో, 9 నుంచి 11వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలులో, ఎంబీబీఎస్ వారణాసిలోని బెనారస్ యూనివర్శిటీలో విద్యనభ్యసించారు. బెనారస్ యూనివర్శిటీలో ఆయన పీడీ కూడా పూర్తి చేశారు. అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. తర్వాత పులివెందులలోని శ్రీనివాసహాలు వీధిలో గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి వైద్య సేవలు అందించేవారు. పులివెందులలోని గంగిరెడ్డి ఆసుపత్రి అంటే ఎంతో ప్రాచుర్యం పొందింది. పులివెందుల ప్రాంతంలో పేదల వైద్యునిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా ప్రతిఫలం ఆశించని డాక్టర్‌గా ఇక్కడ గు ర్తింపు పొందారు. ఎలాంటి రోగమైనా ఆయ న దగ్గరకు వెళ్లి ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. పులివెందుల ప్రాంత ప్రజలేకాకుండా జిల్లాలో నలుమూలల నుంచే కాకుండా అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆయన వద్దకు రోగులు వచ్చి వైద్య సేవలు పొందేవారు. వైద్య సేవలలో మారుతున్న కాలాన్ని బట్టి ఆయన భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో దినేష్ నర్సింగ్ హోం(గంగిరెడ్డి ఆసుపత్రి)ను స్థాపించి వైద్య సేవలు అందించేవారు. తన వద్దకు వచ్చే రోగులపట్ల ఆయన ఎంతో ప్రేమ, ఆప్యాయతలను కనబరిచేవారు. అలాంటి వ్యక్తి తమ మధ్య లేరన్న విషయాన్ని పులివెందుల ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ ప్రస్థానం : డాక్టర్ ఇ.సి. గంగిరెడ్డి 2001 నుంచి 2005 వ రకు పులివెందుల మండల ప్రెసిడెంట్‌గా ప్ర జలకు సేవలు అందించారు. వైఎస్ కుటుంబం పోటీ చేసే ప్రతి ఎన్నికలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించేవారు. ఎన్నికల సమయంలో వైఎస్ కుటుంబానికి మద్దతుగా నియోజకవర్గంలోని ఆయన ప్రచారం నిర్వహించేవారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నీ పాట మిగిలే ఉంది!
-
ఘనంగా బాబుజగ్జీవన్‌రాం వర్ధంతి
కరీంనగర్: మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్‌రాం 32వ వర్ధంతిని శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, టీపీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ హాజరై నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ వ్యవసాయశాఖమంత్రిగా దేశాన్ని అభివృద్ధిలో నడిపించారని కొనియాడారు. టీపీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ జగ్జీవన్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుడని కొనియాడారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి ఆధ్వర్యంలో బాబుజగ్జీవన్‌రాం విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆరెపల్లి మోహన్, ఆకుల ప్రకాశ్, కర్ర రాజశేఖర్, దిండిగాల మధు, వెన్న రాజమల్లయ్య, గందె మాధవిమహేశ్, బాకారపు శివయ్య, మాదాసు శ్రీనివాస్, చింతల కిషన్, టేల భూమయ్య, సదానందంనాయక్, లక్ష్మీనారాయణ, దాసరి సత్యనారాయణ, ఎర్రోళ్ల శ్రీనివాస్, పెద్దెల్లి ఆంజనేయులు పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్‌కు నివాళి కరీంనగర్: బాబుజగ్జీవన్‌రాం వర్ధంతిని శుక్రవారం కరీంనగర్లో నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి నివాళి అర్పించారు. దళిత సంఘాల నాయకులు కల్లెపల్లి శంకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గోష్కి శంకర్, కామారపు శ్యామ్, మనోహర్, గడ్డం కొమురమ్మ, దుబ్బ నీరజ, ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు గోష్కి అజయ్, అంబేద్కర్ యువజన సంఘం నగర అధ్యక్షుడు రమేశ్, కోహెడ వినోద్, ఇల్లందు మొండయ్య, గాలిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కష్టపడి గెలవడం నరేంద్ర నుంచి నేర్చుకోవాలి
కేంద్ర మాజీ మంత్రి వర్ధంతి కార్యక్రమంలో దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో కష్టపడి ఎలా గెలవాలో ఆలె నరేంద్రను చూసి నేర్చుకోవాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర వర్థంతి కార్యక్రమం శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగింది. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ఆలె నరేంద్ర కుటుంబసభ్యులు, పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్తో, బీజేపీతో నరేంద్రకు ఉన్న అనుబంధం, పార్టీ కార్యకర్తల కోసం ఆయన చేసిన కృషిని నేతలు గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఆలె నరేంద్ర ఆద్యుడని దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కొనియాడారు. సహజంగానే బీజేపీకి వ్యతిరేక ఓట్లు ఎక్కువగా ఉంటాయని... ఈ పరిస్థితిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలవాలంటే కష్టపడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. -
మహానేతకు పుష్పాంజలి ఘటించిన సాక్షి ఫ్యామిలి