న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అకాల వర్షాల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. వర్షాల వల్ల ఏపీ, తెలంగాణలో అపారనష్టం జరిగిందని చెప్పారు. గురువారం కేంద్ర మంత్రి దత్తాత్రేయ.. రాధామోహన్ను కలిసి రైతులను ఆదుకోవాలని విన్నవించారు. తొలుత రాష్ట్రాల విపత్తుల నిధుల నుంచి రైతులకు సాయం చేయాలని, ఆ తర్వాత కేంద్ర బృందాలు నష్టాన్ని అంచనా వేశాక పూర్తి సాయం చేస్తామని రాధామోహన్ సింగ్ అన్నారు.