radhamohan Singh
-
కమలనాథులకు కొత్త దళపతి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా బీజేపీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని సోమవారం పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ప్రకటించారు. నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి, పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్న అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇతర సీనియర్ నేతలు అభినందనలు తెలిపారు. ఐదున్నర ఏళ్ల పాటు పార్టీని విజయవంతంగా నడిపి, పలు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో నిలిపిన అమిత్ షా స్థానంలో నడ్డా పార్టీ పగ్గాలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నడ్డాకు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండే నేతగా పేరుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ సైద్ధాంతిక దిక్సూచి ఆరెస్సెస్, ప్రధాని మోదీ, అమిత్ షా సమర్ధించారు. ఈ సంస్థాగత ఎన్నికలో నడ్డా తరఫున మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంగానే ముగిసింది. నడ్డా తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పలువురు రాష్ట్ర శాఖల ప్రతినిధులు నామినేషన్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించడం కొత్త అధ్యక్షుడిగా నడ్డా ముందున్న తక్షణ సవాలు. ఇప్పటివరకు విజయం సాధించని రాష్ట్రాల్లో బీజేపీకి అధికారాన్ని సాధించిపెట్టడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని నడ్డా పేర్కొన్నారు. ఎన్నిక అనంతరం నడ్డా అభినందన కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి షా, పార్టీ అగ్ర నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. మోదీ కొత్త ప్రభుత్వంలో హోంమంత్రిగా అమిత్ షా చేరడంతో.. గత జూన్‌లోనే బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికయ్యారు. అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉండటం వల్ల.. ఒక వ్యక్తికి ఒకే పదవి అని బీజేపీలో ఉన్న సంప్రదాయం నేపథ్యంలో నడ్డా నాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికవడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడి హయాంలో, మోదీ మార్గనిర్దేశంలో బీజేపీ కొత్త శిఖరాలకు చేరుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘నడ్డా నేతృత్వంలో పార్టీ మరింత వైభవాన్ని, మరిన్ని విజయాలను సాధించాలి’ అని రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి నడ్డా ఎదగడం బీజేపీ కార్యకర్తల పార్టీ అనే విషయాన్ని స్పష్టం చేస్తోందని మరోమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. ఇది బీజేపీలోనే సాధ్యం ఒక సాధారణ కార్యకర్త పార్టీ అధ్యక్షుడు కావడం కేవలం బీజేపీలోనే సాధ్యమని కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ‘దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ బీజేపీనే. అయితే, మనం ఇక్కడే ఆగిపోం. కొన్ని రాష్ట్రాలు మిగిలాయి. మన దృష్టి ఇకపై వాటిపైననే. త్వరలో వాటినీ సాధిస్తాం’ అన్నారు. కలిసి స్కూటర్‌పై తిరిగాం నడ్డా అభినందన కార్యక్రమంలో ప్రధాని మోదీ.. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. నడ్డా, తాను పాత స్నేహితులమని, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా తాము కలిసి స్కూటర్‌పై తిరిగేవారమని చెప్పారు. నడ్డా హయాంలో పార్టీకి కొత్త శక్తి, ఆశ, ఆకాంక్షలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షుడికి అందరం పూర్తి సహకారం అందించాలన్నారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతున్న అమిత్ షా నిరుపమాన కార్యకర్త అని ప్రశంసించారు. మరోవైపు, ఇదే వేదికపై నుంచి మోదీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారు కొత్త ఆయుధాలను పట్టుకు తిరుగుతున్నారని ఆరోపించారు. అబద్ధాలను, గందరగోళాన్ని వ్యాప్తి చేయడమే వారు పనిగా పెట్టుకున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవాలని, అదే బీజేపీ బలమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రైతుల ఆందోళన దేనికోసం?
ఇటీవల రైతులు, పాల వ్యాపారులు, కూరగాయల వ్యాపారుల నిరసన ప్రదర్శ నల సందర్భంలో చెలరేగిన ఘర్షణలను దృష్టిలో పెట్టు కుని పంజాబ్‌లో పది రోజుల పాటు జరగాల్సిన గావ్ బంద్ (గ్రామాల బంద్)ను కుదించాలన్న నిర్ణయం హర్షించదగ్గ పరిణామం. అనేక కొట్లాట లకు దారితీసిన రైతుల ఆందోళనలు మరోసారి గ్రామీణ ప్రాంతాల్లో రక్తపాతానికి కారణమౌతాయనే భయంతో గావ్ బంద్‌ను మధ్యలోనే విరమించడం మంచి నిర్ణయం. కిందటేడాది మధ్యప్రదేశ్‌లోని మాండసోర్‌లో రైతులు ఆందోళనకు దిగినప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మర ణించారు. ఇలాంటి దురదృష్టకర ఘటన పునరా వృతం కాకూడదనే భావనతోనే గావ్ బంద్‌ను విర మించారు. రైతుల నిరసనకు న్యాయమైన కారణాలు లేవన్న కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్ హరి యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్... నిజంగా రైతుల పరిస్థితి అంతా బాగుంటే, వ్యవసా యంలో లోపాలే లేకుంటే రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయనే అనుమానం నాకు వస్తోంది. వ్యవసాయరంగం వ్యవస్థాపరమైన సంక్షో భంలో కూరుకుపోతోంది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు నిలకడగా కొనసాగడా నికి కర్షకులను కావాలనే ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడకుండా చేస్తున్నారు. ఆర్బీఐ మాజీ గవ ర్నర్, ప్రసిద్ధ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ ఇది వరకు చెప్పిన మాటలే దీనికి తార్కాణం. వ్యవసాయాన్ని ఆర్థికంగా గిట్టుబాటయ్యే వృత్తిగా మార్చాల్సిన అవ సరముందని చెప్పడానికి బదులు ‘‘రైతులను వ్యవ సాయం నుంచి బయటకు తీసుకొచ్చి నగరాలకు తరలించడమే అతి పెద్ద సంస్కరణ. ఎందుకంటే, పట్టణ ప్రాంతాలకు తక్కువ వేతనంతో పనిచేసే కార్మికుల అవసరం ఉంది’’ అని సూత్రీకరించారు. నేడు దేశం ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభం ఓ ‘ఆర్థిక కుట్ర’ ఫలితమని చెప్పవచ్చు. నామమాత్రంగా సైతం పెరగని వ్యవసాయో త్పత్తుల ధరలు వ్యవసాయానికి సంబంధించిన తాజా ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే రైతులకు ఏం దక్కుతోందో స్పష్టమౌతుంది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం నాలుగో భాగంలో వ్యవసాయోత్పత్తుల ధరలు కేవలం 0.4 శాతం మాత్రమే పెరిగాయని కేంద్ర గణాంక కార్యలయం (సీఎస్ఓ) ప్రకటిం చింది. 2011–12 మధ్య ఐదేళ్ల కాలంలో వాస్తవిక వ్యవసాయ ఆదాయాలు ఏటా అర శాతం కన్నా తక్కువే (ఖచ్చితంగా చెప్పాలంటే 0.44) పెరిగా యని నీతి ఆయోగ్ ఇది వరకటి నివేదికలో వెల్లడిం చింది. వ్యవసాయోత్పత్తుల నికర ధరలు ప్రపంచ వ్యాప్తంగా 1985–2005 మధ్య ఇరవై ఏళ్ల కాలంలో ఎదుగూబొదుగూ లేకుండా నిలిచిపోయాయని ఐక్య రాజ్యసమితి అనుబంధ సంస్థ అంక్టాడ్ కొన్నేళ్ల క్రితం విడుదల చేసిన ఓ నివేదికలో తెలిపింది. 1970 సంవత్సరంలో గోధుమకు క్వింటాలుకు కనీస మద్దతు ధర 76 రూపాయలుంది. 45 ఏళ్ల తర్వాత, 2015లో గోధుమల ధర క్వింటాలుకు రూ. 1435కు పెరిగింది. అంటే గోధుమ మద్దతు ధర 19 రెట్లు పెరిగింది. ఈ నాలుగున్నర దశాబ్దాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం, కరవు భత్యం (డీఏ) కలిపి 120 నుంచి 150 రెట్లు పెరిగింది. కళా శాల–విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల వేతనాలు 150 నుంచి 170 రెట్లు, పాఠశాల ఉపాధ్యాయుల జీతాలు 280 నుంచి 320 రెట్లు పెరిగాయి. అయితే, రైతుల ఉత్పత్తులకు చెల్లించే ధరలు ఈ 45 సంవత్సరాల్లో నిజమైన పెరుగుదల లేకుండా దాదాపు నిలకడగా నిలిచిపోయాయి. అంతేగాక, ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుతో ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 108 రకాల భత్యాలు అందుబాటులోకి వచ్చాయి. కనీస మద్దతు ధర నిర్ణయించే క్రమంలో తమకు కూడా ఇంటి అద్దె అలవెన్స్, వైద్య ఖర్చుల అలవెన్స్, విద్యకు అలవెన్స్, ప్రయాణ భత్యం చేర్చా లని రైతులు ఎప్పుడైనా అడిగారా? అనుమానమే. ఇంతటి అననుకూల పరిస్థితుల్లో దేశానికి ధాన్యాగారంగా పరిగణించే పంజాబ్‌లో ప్రతి ముగ్గురు రైతుల్లో ఒకరు పేదరికంలో జీవిస్తున్నారన్న విషయం ఆశ్చర్యం కలిగించదు. 98 శాతం నికర సాగునీటి సరఫరా సౌకర్యాలతో ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో పప్పుధాన్యాల దిగుబడి సాధి స్తున్నా రైతుల ఆత్మహత్యలకు పంజాబ్ కేంద్రంగా మారిపోయింది. 2000–2017 మధ్య కాలంలో 16,600 మంది పంజాబ్ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మూడు విశ్వవిద్యాలయాల ప్రతిని ధులు ఇంటింటికీ వెళ్లి జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. సాగు సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పడం తేలికే. అయితే, నానా కష్టాలు పడి పండించిన పంటకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆదాయం రైతుకు అందకుండా చేయడమే ప్రధాన కారణం. రాష్ట్ర ఆదాయంలో 88.36 శాతం సొమ్మును జీతాలు, పింఛన్లు చెల్లించడానికి, రుణా లపై వడ్డీలు కట్టడానికి, విద్యుత్ సబ్సిడీ చెల్లించడా నికి పోతే రైతుల సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి మిగి లేది ఎంతో గమనిస్తే సమస్య తీవ్రత అర్థమౌతుంది. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
‘ఖరీఫ్’ మద్దతుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఖరీఫ్ సాగులో వరి, పప్పుధాన్యాలు సహా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెల ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు మద్దతుగా నిలిచేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్.. వ్యవసాయ శాఖ 2017– 18 ఖరీఫ్ సీజన్ కోసం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అయితే ఎంతమొత్తం పెరిగిందనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే క్వింటాలుకు వరికి రూ.80 (ప్రస్తుతం సాధారణ గ్రేడ్ వరికి రూ.1550, ఏ గ్రేడ్ వరికి రూ.1590 ఇస్తున్నారు), పప్పుధాన్యాలకు రూ.400 (రూ.200 బోనస్ కలుపుకుని), సోయాబీన్‌కు రూ.175, పత్తికి రూ. 160 పెంచాలనే ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. మహారాష్ట, మధ్యప్రదేశ్‌లో రుణమాఫీ కోసం రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే మద్దతు ధరపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు, కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ కూడా రైతుల ఆందోళనతో తన మీడియా సమావేశాన్ని రద్దుచేసుకున్నారు. -
పంట రుణాలపై 660 కోట్ల వడ్డీ మాఫీ
నవంబర్, డిసెంబర్లకు వర్తింపు ► గృహ రుణ వడ్డీ రాయితీ పథకానికి ఓకే ► వరిష్ట పెన్షన్ బీమా యోజనకూ ఆమోదం ► కేంద్ర కేబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో నగదు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. సహకార బ్యాంకుల నుంచి 2016 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య తీసుకున్న స్వల్పకాలిక పంటరుణాలపై ఆ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలకుగాను రూ. 660.50 కోట్ల వడ్డీని మాఫీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్, డిసెంబర్ల వడ్డీని చెల్లించిన రైతులకు ఆ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుందని వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సహకార బ్యాంకులకు 4.5 శాతం వడ్డీతో రుణంగా ఇవ్వడానికి రూ. 20 వేల కోట్ల రుణాలను తీసుకునేందుకు నాబార్డ్‌కు కేబినెట్ అనుమతినిచ్చింది. 1.8 శాతం వడ్డీ రాయితీ, 0.2 శాతం పాలనా వ్యయాన్ని నాబార్డ్ భరించేందుకు రూ. 400 కోట్ల గ్రాంట్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. గృహ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ గ్రామీణ ప్రజలు కొత్త ఇళ్లు కట్టుకోవడానికి, లేదా ప్రస్తుత ఇళ్ల అభివృద్ధి కోసం తీసుకునే గృహ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ ఇచ్చే పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాసయోజన(గ్రామీణ్) కిందికి రాని ప్రతి కుటుంబానికీ రూ. 2 లక్షల వరకు రుణంపై ఈ రాయితీ ఇస్తారు. దీనితో పేదలకు నెల వాయిదాల(ఈఎంఐ)పై భారం తగ్గుతుందని, ఈ పథకాన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అమలు చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాని మోదీ కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఈ పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీ సీనియర్ సిటిజన్లకు పదేళ్లపాటు ఏటా 8 శాతం వడ్డీ ఇచ్చే వరిష్ట పెన్షన్ బీమా యోజన–2017 పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది.. వీటిలో దేన్ని ఎంచుకుంటే దాని ప్రాతిపదికగా పెన్షన్ అందిస్తారు. ఎల్ఐసీ అమలు చేయనున్న ఈ పథకంలో 60 ఏళ్లు, ఆపై వయసున్న వారు పథకం మొదలైన నాటి నుంచి ఏడాది లోపల చేరవచ్చు. ఐఐఎంల నుంచి ఇక డిగ్రీలు దేశంలోని 20 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లు ఇకపై తమ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా, ఫెలో ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్మెంట్లు కాకుండా ఎంబీఏ వంటి డిగ్రీలు, పీహెచ్‌డీలు ఇవ్వనున్నాయి. ఐఐఎంలను ఇకపై జాతీయ ప్రాధాన్య సంస్థలుగా గుర్తిస్తారు. దీనికి సంబంధించిన ఐఐఎం–2017 బిల్లును కేబినెట్ ఆమోదించింది. దీన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఐఐఎంలకు సంపూర్ణ స్వయంప్రతిపత్తిపై బిల్లు దృష్టి సారించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఐఐఎంలు సొసైటీల చట్టం కింద రిజిస్టర్ అయి ఉండడంతో వీటికి డిగ్రీలు ఇచ్చే అవకాశం లేదు. ఈ సంస్థలు ఇచ్చే డిప్లమాలు, ఫెలో ప్రోగ్రామ్‌లు.. ఎంబీఏ, పీహెచ్‌డీలకు సమానంగా భావిస్తున్నా వీటి సమానత్వంపై సార్వత్రిక ఆమోదం లేదు. కాగా, హరితవాయు ఉద్గారాల కట్టడికి కోసం క్యోటో ప్రొటోకాల్ రెండో దశ అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నారైలకు ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనూ, ప్రతినిధి ద్వారానూ ఓటు వేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను వాయిదా వేసింది. -
‘పాల ఉత్పత్తిలో మనమే టాప్’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పాల ఉత్పత్తిలో గత 15 ఏళ్లుగా భారత్ అగ్రగామిగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. శ్వేత విప్లవ ఆద్యుడు డాక్టర్ కురియన్ జయంతి సందర్భంగా శనివారం ఢిల్లీలో నిర్వహించిన ‘జాతీయ పాల దినోత్సవం’లో ఆయన పాల్గొన్నారు. పాల ఉత్పత్తిలో గత రెండేళ్లలో దేశం 6.28 శాతం వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. 2012 లెక్కల ప్రకారం ప్రపంచలోని 13 శాతం పశుసంపద భారత్‌లోనే ఉందని చెప్పారు. దేశీయ పశుసంపదను పరిరక్షించడానికి, డైరీల అభివృద్ధికి ప్రభుత్వం ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. దేశీయ ఆవులు, గేదెల నుంచి లభించే ఏ2 రకం పాలు వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయని, వీటికి విడిగా మార్కెటింగ్ చేపట్టాలని అభిప్రాయపడ్డారు. పశువుల కొనుగోళ్లు, అమ్మకాలకు ‘ఈ-క్యాటిల్ హాట్’ అనే పోర్టల్‌ను ప్రారంభించారు. -
రాష్ట్రం.. విత్తన భాండాగారం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/గజ్వేల్: నాణ్యమైన విత్తనాలను రూపొందించడానికి అవసరమైన నేలలు, వాతావరణం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఉందని, తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే విత్తన భాండాగారంగా ఆవిర్భవించబోతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో రూ.1,823 కోట్ల వ్యయంతో హార్టికల్చర్ యూనివర్సిటీ, రూ.50 కోట్ల వ్యయంతో అటవీ కళాశాల, మరో రూ.30 కోట్ల వ్యయంతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (ఫల పరిశోధన కేంద్రం) నిర్మాణ పనులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు వారు 18 కంపెనీలు ఏర్పాటు చేసిన ఉద్యాన పంటల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యాన పంటలకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. దక్షిణ భారత దేశంలోనే రెండో హార్టికల్చర్ యూనివర్సిటీ తెలంగాణలో ఏర్పాటు చేయడంతో ఇక్కడి పంటలపై అద్భుతమైన ప్రయోగాలు జరుగుతాయన్నారు. పండ్లు, పూలు, కూరగాయల సాగు మరింత విస్తరిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌కు కావాల్సిన కూరగాయలను ఇక్కడి నుంచే సరఫరా చేయగలుగుతారన్నారు. గోదాముల నిర్మాణానికి అనుమతులివ్వండి తెలంగాణలో ప్రస్తుతం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. మరో 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణానికి కేంద్ర సహాయం చేయాలని కోరారు. కరువుతో అల్లాడుతున్న తెలంగాణ రైతాంగానికి సముచిత పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీని వేగంగా నిర్మించడానికి అవసరమైన నిధులను విడుదల చేయాలన్నారు. ప్రతి చేనుకు నీరందించడమే మోదీ సర్కార్ లక్ష్యం: రాధామోహన్ సింగ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి చేనుకు నీరందించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందుకు సాగుతోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడానికి ఈ-మార్కెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. దేశంలోని 550 ప్రముఖ మార్కెట్లను ఈ విధానంతో అనుసంధానం చేస్తామన్నారు. వారం, పది రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కరువు సహాయం అందజేస్తామని ప్రకటించారు. వ్యవసాయరంగంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు చెప్పారు. వ్యవసాయరంగాభివృద్ధి కోసం ఆర్కేవీవై (రాష్ట్రీయ కృషి వికాస్ యోజన), పీకేవీవై (పరంపరగత్ కృషి వికాస్ యోజన) పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, టి.హరీష్‌రావు, ఐసీఐఆర్ చైర్మన్ అయ్యప్పన్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల నినాదాలు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సభా ప్రాంగణంలో నిరుద్యోగ యువ కులు నినాదాలు చేశారు. సభలో కేసీఆర్ ప్రసంగం చివరి దశకు చేరుకున్న తరుణంలో యువకులు తాము కూర్చున్న చోటు నుంచే.. ‘ఉద్యోగాలు లేని చదువులెందుకు..? నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి’ అంటూ నినదించారు. కొందరు యువకులు కుర్చీలపై నిలబడి గట్టిగా అరవడానికి ప్రయత్నించారు. -
హార్టికల్చర్ వర్సిటీకి శంకుస్థాపన
ములుగు లో హార్టికల్చర్ యూనివర్సిటీకి తెలంగాణ సీఎం కే సీఆర్ శంకుస్తాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి రైతూ.. తన బిడ్డను రైతు చేయాలనుకునే రోజు రావాలని ఆకాంక్షించారు. వ్యవసాయం లాభసాటిగా మారాలని అన్నారు. మరో వైపు ముఖ్య మంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30 కల్లా ప్రతి ఇంటికీ నల్లా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహాకారం కావాలని కోరారు. -
హార్టికల్చర్ వర్సిటీకి శంకుస్థాపన
-
పంట బీమాపై కేంద్ర కేబినెట్ చర్చ
న్యూఢిల్లీ: పంట బీమా పథకంపై కేంద్ర కేబినెట్ చర్చించింది. ఈ విషయంలో కీలకమైన ప్రీమియం విషయంపై పలువురు మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా చర్చించారు. గతేడాది వ్యవసాయ పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టగా.. అప్పడు దీనిపై జరిగిన చర్చలలో ప్రీమియం రేటు విషయంలో మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆహార ధాన్యాలు, నూనె గింజటపై 2.5 శాతం, ఉద్యానపంటలకు 5 శాతం ప్రీమియమ్ చెల్లించాలని మంతిత్వ శాఖ ప్రతిపాదించగా.. అన్ని పంటలకు సమానంగా 1-1.5 శాతం ప్రీమియం ఉండాలని కొందరన్నారు. దీనిపై బుధవారం కూడా చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ కొత్త పంట బీమా పథకంపై ప్రజెంటేషన్ ఇచ్చి.. దీని వల్ల రైతులకు కలిగే లాభాన్ని కూడా వివరించినట్లు తెలిసింది. 2.2-5 శాతం ప్రీమియం చెల్లించటం వల్ల కేంద్రంపై రూ.8 నుంచి 11 వేల కోట్ల భారం పడుతుందనే భావన వ్యక్తమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత భారం మోయటం కష్టమని ఆర్థిక శాఖ చెప్పిది. కాగా, ప్రపంచ వ్యాక్సిన్ సంస్థ (గావీ) 2016-2021 మధ్యకాలంలో భారత్‌లో కొత్త టీకాలను ప్రవేశపెట్టే ఒప్పందానికి ప్రతిపాదన చేసింది. బుధవారం ప్రధానితో గావీ సీఈవో సేథ్ బర్క్లీ సమావేశమయ్యారు వచ్చే ఐదేళ్లలో భారత్‌కు 500 మిలియన్ డాలర్ల (రూ.3.3వేల కోట్లు) విలువైన టీకాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోపక్క జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మోదీ తనను కలిసిన కశ్మీర్ యువతతో అన్నారు. -
ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రానికి కేంద్ర బృందం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాల పరిశీలనకు ఒకట్రెండు రోజుల్లో కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ వెల్లడించారు. తక్షణ సహాయం కింద రాష్ట్ర విపత్తు నిర్వహణ రెండో విడత నిధులు రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల ప్రతినిధి బృందం బుధవారం రాధామోహన్ సింగ్‌ను కలసి కరువు మండలాల పరిస్థితులపై నివేదికను అందజేసింది. వారితో భేటీ అనంతరం మంత్రి రాధామోహన్ సింగ్ మాట్లాడుతూ, కేంద్రబృందం కరువు మండలాలను పరిశీలించి నివేదిక ఇచ్చాక సహాయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధులతోపాటు అదనంగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త రైతు బీమా పథకంలో రైతులు ఎక్కువ ప్రీమియం చెల్లించలేకపోతున్నందున వారికి వెసులుబాటు ఉండేలా మార్పులు చేస్తామన్నారు. పత్తి మద్దతు ధర నిర్ణయం తమ చేతుల్లో లేదని స్పష్టం చేశారు. ప్రతినిధి బృందంలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రి పోచారం, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కవిత, సీతారాం నాయక్, బాల్క సుమన్, నగేశ్, దయాకర్, కె.ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ ఉన్నారు. వచ్చే నెల్లో ఉద్యానవర్సిటీ శంకుస్థాపన జనవరి 7న ఉద్యానవన విశ్వవిద్యాలయం శంకుస్థాపనకు వచ్చేందుకు కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్ అంగీకారం తెలిపారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం పోచారం మాట్లాడారు. ఉద్యానవన వర్సిటీ పూర్తిస్థాయిలో పనిచేయాలంటే రూ.1,813 కోట్లు అవసరం ఉంటుందని, 200 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. రూ.75 కోట్లు ఇవ్వడానికి కేంద్రం హామీ ఇచ్చిందని, ఇప్పుడు రూ.10 కోట్లు ఇచ్చిందని చెప్పారు. కరువు మండలాల్లోని సమస్యలను పరిష్కరించడానికి రూ.2,514 కోట్లు అవసరమని, తక్షణ సహాయం కింద రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరామన్నారు. జౌళి శాఖ మంత్రితో భేటీ ప్రతినిధి బృందం తొలుత జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ను కలిసింది. రాష్ట్రంలో పత్తిరైతులు ఎదుర్కొంటున్న సమస్యలను డిప్యూటీ సీఎం కడియం, పోచారం శ్రీనివాసరెడ్డి సవివరంగా గంగ్వార్ దృష్టికి తీసుకెళ్లారు. సీసీఐ నిర్ణయించిన మద్దతు ధర సైతం పత్తిరైతులకు అందడం లేదని, దీన్ని క్వింటాల్‌కు రూ.5 వేలకు పెంచాలని కోరారు. దీనికి గంగ్వార్ స్పందిస్తూ, మద్దత ధర పెంపు తన చేతుల్లో లేదని, వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వం లోని అథారిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 40 క్వింటాళ్ల కన్నా ఎక్కువ పత్తిని తెచ్చినా కొనుగోలు చేస్తామని, రైతుల ఖాతాల్లోకి నేరుగా 48 గంటల్లో డబ్బులు జమచేస్తామన్నారు. అనంతరం బృందం రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కలసి రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు వచ్చే రైల్వే బడ్జెట్లో నిధులివ్వాలని కోరింది. -
ప్రేమ వ్యవహారాలు,నపుంసకత్వం కూడా
-
ప్రేమ వ్యవహారాలు,నపుంసకత్వం కూడా
రైతుల ఆత్మహత్యలకు కారణాలపై మంత్రి రాధామోహన్ సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ఆత్మహత్యలకు కారణాల్లో అప్పులతోపాటు ప్రేమ వ్యవహారాలు, నపుంసకత్వం తదితరాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వానికి మనసు మొద్దుబారిందని ధ్వజమెత్తాయి. 2014లో దేశవ్యాప్తంగా 5,650 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాధామోహన్ రాతపూర్వకంగా తెలిపారు. ఆత్మహత్యకు కారణాల్లో రుణాలు, పంటలు దెబ్బతినడం, కరువు, సామాజిక-ఆర్థిక కారణాలు ఉన్నాయని వివరించారు. కారణాల్లో ప్రేమ వ్యవహారాలు, అనారోగ్యం, నంపుంసకత్వం, మాదకద్రవ్యాలు వంటివి కూడా ఉన్నాయని జాతీయ నేర రికార్డుల సంస్థ(ఎస్సీఆర్బీ)ను ఉటంకిస్తూ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. రైతుల పరిస్థితి తెలుసుకోవడానికి వారి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని మోదీ తన మంత్రులకు చెప్పాలన్నారు. రాధామోహన్ క్షమాపణ చెప్పాలని నరేశ్ అగర్వాల్(ఎస్పీ)డిమాండ్ చేశారు. సీతారాం ఏచూరి(సీసీఎం), డి.రాజా(సీపీఐ) కూడా విమర్శలు సంధించారు. మంత్రి సమాధానం ప్రకారం.. దేశంలో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 5,178 మంది పురుషులు, 472 మంది మహిళలు ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 2,568 ఆత్మహత్యలు జరిగాయి. రెండోస్థానంలో తెలంగాణ(898), మూడోస్థానంలో ఛత్తీస్‌గఢ్(826) ఉన్నాయి. మహిళా రైతు ఆత్మహత్యలు తెలంగాణలో అత్యధికంగా(147) జరిగాయి. -
'ఏపీ తెలంగాణ రైతులను ఆదుకుంటాం'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అకాల వర్షాల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. వర్షాల వల్ల ఏపీ, తెలంగాణలో అపారనష్టం జరిగిందని చెప్పారు. గురువారం కేంద్ర మంత్రి దత్తాత్రేయ.. రాధామోహన్‌ను కలిసి రైతులను ఆదుకోవాలని విన్నవించారు. తొలుత రాష్ట్రాల విపత్తుల నిధుల నుంచి రైతులకు సాయం చేయాలని, ఆ తర్వాత కేంద్ర బృందాలు నష్టాన్ని అంచనా వేశాక పూర్తి సాయం చేస్తామని రాధామోహన్ సింగ్ అన్నారు. -
'తెలంగాణ నుంచి ఎలాంటి నివేదిక రాలేదు'
న్యూఢిల్లీ: రైతాంగ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకెలాంటి నివేదిక రాలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. తాను హైదరాబాద్ వెళ్లినప్పుడు సీఏం కేసీఆర్, ఇతర మంత్రులను కలిశానని చెప్పారు. ఢిల్లీ వచ్చినప్పుడు కేసీఆర్, మంత్రులు తనను కలవలేదని చెప్పారు. కరువు సమస్యపై తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక రానంతవరకు కేంద్రం పాత్ర ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో అన్నదాతల సమస్యలను పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపుతున్నట్టు రాధామోహన్ సింగ్ వెల్లడించారు. -
కేంద్ర వ్యవసాయ వర్సిటీ ఉత్తదే!
రాష్ట్ర మంత్రికి తేల్చి చెప్పిన కేంద్ర వ్యవసాయ మంత్రి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రీయ వ్యవసాయ విశ్వ విద్యాలయం వస్తోందని ఇప్పటివరకు జరిగిన ప్రచారం, పాలకులు చేసిన హడావుడి అంతా ఉత్తదేనని స్పష్టమైంది. యూనివర్సిటీ అక్కడ, ఇక్కడ అంటూ స్థల పరిశీలనలు, క్షేత్ర స్థాయి నివేదికలంటూ చేసిందంతా కేవలం హంగామా మాత్రమేనని వెల్లడైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయమే ఏర్పాటు కాబోతుందని తేలింది. ఇంత గందరగోళం ఎందుకు జరిగిందనే దానిపై అధికార వర్గాలు చెబుతున్న దాని ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్లో ప్రకటించారు. ఇందుకోసం తొలి విడతగా 200 కోట్ల రూపాయలను కూడా ప్రతిపాదించారు. దీంతో పాలకులు రాష్ట్రానికి మరో వ్యవసాయ విశ్వవిద్యాలయం వస్తుందనుకున్నారు. దీని ఏర్పాటుపై మల్లగుల్లాలు పడ్డారు. చివరకు గుంటూరు జిల్లా లాంఫారంలో పెట్టబోతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఈలోగా కేంద్రం తన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రాలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 50 కోట్లు కేటాయించింది. ఈ నిధుల వ్యవహారమై స్పష్టత లేకపోవడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు. మంత్రి దృష్టికీ విషయాన్ని తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యవసాయ సమస్యలపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాథామోహన్సింగ్తో భేటీ అయినప్పుడు చర్చిద్దామని మంత్రి చెప్పిన మీదట అధికారులు ఇటీవల ఢిల్లీలో సంబంధిత శాఖాధికారులను వివరణ కోరారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండు కానుందని, ఆంధ్రప్రదేశ్‌లో దాని భవనాల నిర్మాణానికే రూ.50 కోట్లు కేటాయించామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న అంశాన్ని తమరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో రాష్ర్ట మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అవాక్కయ్యారు. -
నీలి విప్లవంతో ఆహార భద్రత: రాధామోహన్ సింగ్
* కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ * ముఖ్యమంత్రులు కేసీఆర్, బాబుతో వేర్వేరుగా భేటీ సాక్షి, హైదరాబాద్: సుస్థిరమైన ఆహార భద్రతకు నీలి విప్లవం దోహద పడుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ తెలిపారు. హైదరాబాద్‌లో మూడు రోజులపాటు జరిగే ఏషియా ఫసిఫిక్ రీజియన్ సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సదస్సుకు 21 దేశాల నుంచి 30 మంది మత్స్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రపంచంలో చేపల ఉత్పత్తుల్లో మనదేశం రెండో స్థానంలో ఉందన్నారు. దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందడమే లక్ష్యంగా నరేంద్రమోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. నదుల అనుసంధానం ద్వారా ఈ ల క్ష్యం సాధిస్తామని పేర్కొన్నారు. దేశాన్ని బలోపేతం చేయాలని నరేంద్రమోడీ కృతనిశ్చయంతో ఉన్నార ని, ఇది జరగాలంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్‌మోర్చా పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఫిష్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. సాగుకు సాయపడండి తెలంగాణలో వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తోడ్పాటు ఇవ్వాల ని కేంద్ర మంత్రికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశా రు. కేంద్రమంత్రి సింగ్ సీఎం కేసీఆర్‌ను సోమవారం సచివాలయంలో కలిశారు. తుంపర సేద్యానికి 500 కోట్లివ్వండి: బాబు ఆంధ్రప్రదేశ్‌లో తుంపర సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు కేటాయించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాధామోహన్‌సింగ్‌ను కోరారు. సోమవారం ఆయనకు బాబు తన నివాసంలో విందు ఇచ్చారు. -
రాజమండ్రిలో వ్యవసాయ వర్సిటీకి సీటీఆర్ఐ భూమి
న్యూఢిల్లీ: రాజమండ్రిలోని జాతీయ పొగాకు పరిశోధన సంస్థ(సీటీఆర్ఐ)కు చెందిన 21.93 ఎకరాల స్థలాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం బదిలీ చేస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం ఒక పత్రికాప్రకటనను విడుదల చేశారు. సీటీఆర్ఐ ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని వ్యవసాయ యూనివర్సిటీ కోసం బదిలీ చేయాల్సిందిగా కోరుతూ వెంకయ్యనాయుడు జూన్ 2న రాధామోహన్ సింగ్‌కు లేఖ రాశారు. దానిపై స్పందించిన రాధామోహన్ సింగ్.. వెంకయ్యనాయుడిని సోమవారం కలసి ఆయన అభ్యర్థనను ఆమోదించామని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలోని తూర్పుగోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో.. తెలంగాణలోని కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కృషి విజ్ఞాన్ కేంద్రాలు(కేవీకే) ఏర్పాటు చేయాలని వెంకయ్యనాయుడు కోరారు. ఇందుకు రాధామోహన్ సానుకూలంగా స్పందించారని ఆ ప్రకటనలో వెల్లడించారు.