* కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్
* ముఖ్యమంత్రులు కేసీఆర్, బాబుతో వేర్వేరుగా భేటీ
సాక్షి, హైదరాబాద్: సుస్థిరమైన ఆహార భద్రతకు నీలి విప్లవం దోహద పడుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ తెలిపారు. హైదరాబాద్‌లో మూడు రోజులపాటు జరిగే ఏషియా ఫసిఫిక్ రీజియన్ సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సదస్సుకు 21 దేశాల నుంచి 30 మంది మత్స్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రపంచంలో చేపల ఉత్పత్తుల్లో మనదేశం రెండో స్థానంలో ఉందన్నారు. దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందడమే లక్ష్యంగా నరేంద్రమోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
నదుల అనుసంధానం ద్వారా ఈ ల క్ష్యం సాధిస్తామని పేర్కొన్నారు. దేశాన్ని బలోపేతం చేయాలని నరేంద్రమోడీ కృతనిశ్చయంతో ఉన్నార ని, ఇది జరగాలంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్‌మోర్చా పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఫిష్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు.
సాగుకు సాయపడండి
తెలంగాణలో వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తోడ్పాటు ఇవ్వాల ని కేంద్ర మంత్రికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశా రు. కేంద్రమంత్రి సింగ్ సీఎం కేసీఆర్‌ను సోమవారం సచివాలయంలో కలిశారు.
తుంపర సేద్యానికి 500 కోట్లివ్వండి: బాబు
ఆంధ్రప్రదేశ్‌లో తుంపర సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు కేటాయించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాధామోహన్‌సింగ్‌ను కోరారు. సోమవారం ఆయనకు బాబు తన నివాసంలో విందు ఇచ్చారు.
నీలి విప్లవంతో ఆహార భద్రత: రాధామోహన్ సింగ్
Published Tue, Jun 24 2014 4:01 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement