ఖరీఫ్ సాగులో వరి, పప్పుధాన్యాలు సహా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
అయితే క్వింటాలుకు వరికి రూ.80 (ప్రస్తుతం సాధారణ గ్రేడ్ వరికి రూ.1550, ఏ గ్రేడ్ వరికి రూ.1590 ఇస్తున్నారు), పప్పుధాన్యాలకు రూ.400 (రూ.200 బోనస్ కలుపుకుని), సోయాబీన్‌కు రూ.175, పత్తికి రూ. 160 పెంచాలనే ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. మహారాష్ట, మధ్యప్రదేశ్‌లో రుణమాఫీ కోసం రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే మద్దతు ధరపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు, కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ కూడా రైతుల ఆందోళనతో తన మీడియా సమావేశాన్ని రద్దుచేసుకున్నారు.