రైతాంగ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకెలాంటి నివేదిక రాలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు.
న్యూఢిల్లీ: రైతాంగ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకెలాంటి నివేదిక రాలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. తాను హైదరాబాద్ వెళ్లినప్పుడు సీఏం కేసీఆర్, ఇతర మంత్రులను కలిశానని చెప్పారు. ఢిల్లీ వచ్చినప్పుడు కేసీఆర్, మంత్రులు తనను కలవలేదని చెప్పారు.
కరువు సమస్యపై తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక రానంతవరకు కేంద్రం పాత్ర ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో అన్నదాతల సమస్యలను పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపుతున్నట్టు రాధామోహన్ సింగ్ వెల్లడించారు.