సాక్షి, అచ్చంపేట: రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఢిల్లీలో కొన్ని రోజులుగా నిరసన తెలియజేస్తున్న రైతులను నియంత్రించేందుకు జాతీయ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఆరోపించారు.
కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సింగిల్ విండో, డోక్రా, మార్కెట్ యార్డులు ఎత్తివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎఫ్‌సీఐ.. వరి, సీసీఐ.. పత్తి, మార్క్‌ఫెడ్.. కంది, పసుపు, మొక్కజొన్న పంటలు కొనే పరిస్థితి లేకుండా మద్దతు ధర దక్కకుండా చేశారన్నారు. కేంద్రం బేషరతుగా రైతు చట్టాలను రద్దు చేయాలన్నారు. తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేసి రైతు చట్టాలపై ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని విమర్శించారు.
చదవండి: (ఇది యాత్రల కాలం)
Comments
Please login to add a commentAdd a comment