మీ కృషి అభినందనీయం
మీ కృషి అభినందనీయం
Published Wed, Jun 7 2017 2:48 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
దత్తాత్రేయకు కైలాశ్ సత్యార్థి ప్రశంస
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక, ఉపాథి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలోని కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖకు విచ్చేసిన కైలాశ్.. దేశంలో బాల కార్మికుల నిషేధ చట్టం, ప్రమాదకర పరిశ్రమల్లో 14–18 ఏళ్లలోపు బాలలను నియమించుకోవడంపై నిషేధం విధి స్తూ చట్టాలు రూపొందించడంపై ఆయన కేంద్ర మంత్రి దత్తాత్రేయను అభినందించారు. ఈ చట్టాలను రూపొందించి పార్లమెంటులో ఆమోదింపచేయడంలో కార్మికశాఖ కీలక పాత్ర పోషించిందని సత్యార్థి కొనియాడారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. బాలల హక్కుల కోసం ఉద్యమాలు చేసిన కైలాశ్ సత్యార్థి కృషి అభినందనీయమన్నారు. ఈ నెల 12 నుంచి జెనీవాలో అంతర్జాతీయ కార్మిక శాఖ మంత్రుల సమావేశాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. సమావేశంలో ఐఎల్‌వో డైరెక్టర్ పిన్ బిన్‌పాల్, కార్మిక శాఖ కార్యదర్శి సత్యవతి పాల్గొన్నారు.
Advertisement