kailash satyardhi
-
ఆమె గాంధీ ఆత్మనే చంపేసింది..
జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరం గాడ్సే నిజమైన దేశభక్తుడన్న బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై విమర్శల పరంపర కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీలతోపాటు, అధికార బీజేపీ సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే క్రికెట్, బిజినెస్ ఇలా వివిధ రంగాల ప్రముఖులు కూడా ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి చేరారు. గాడ్సే గాంధీ శరీరాన్ని మాత్రమే హత్య చేశాడు. కానీ ప్రజ్ఞాసింగ్ లాంటి వాళ్లు గాంధీ ఆత్మను, దానితో పాటు అహింస, శాంతి, సహనాలను చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విటర్లో ఘాటుగా స్పందించారు. చిన్న చిన్న స్వలాభాల కోసం బీజేపీ నాయకత్వం తాపత్రయ పడుతోందని మండిపడ్డారు. తక్షణమే ఆమెను బీజేపీ పార్టీనుంచి బహిష్కరించాలంటూ ట్వీట్ చేశారు. కాగా మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ను భోపాల్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీకి నిలపడమే సర్వత్రా పెద్ద చర్చకు దారి తీసింది. మరోవైపు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా గాంధీని హత్య చేసిన గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్నే రేపింది. గాడ్సే మొదటి హిందూ తీవ్రవాదిగా పేర్కొన్న సినీహీరో రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కౌంటరగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత, భోపాల్ బీజేపీ అభ్యర్ధి దిగ్విజయ్ సింగ్, ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా కూడా సాధ్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన ప్రజ్ఞా సింగ్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. అటు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పిలిచిన ఆమెను ఎన్నటికి క్షమించనని వ్యాఖ్యానించడం విశేషం. गोडसे ने गांधी के शरीर की हत्या की थी, परंतु प्रज्ञा जैसे लोग उनकी आत्मा की हत्या के साथ, अहिंसा,शांति, सहिष्णुता और भारत की आत्मा की हत्या कर रहे हैं।गांधी हर सत्ता और राजनीति से ऊपर हैं।भाजपा नेतृत्व छोटे से फ़ायदे का मोह छोड़ कर उन्हें तत्काल पार्टी से निकाल कर राजधर्म निभाए। — Kailash Satyarthi (@k_satyarthi) May 18, 2019 -
బాల కార్మికుల్లేని తెలంగాణను నిర్మిద్దాం
కరీంనగర్ లీగల్/శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్)/ఇబ్రహీంపట్నం రూరల్ : బాల కార్మికుల్లేని తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి పిలుపునిచ్చారు. దేశంలో పిల్లలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సంరక్షణ కోసం అందరూ ఉద్యమించాలన్నారు. ప్రపంచంలో 53 శాతం బాలలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని శేరిగూడ శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాలలో ‘చైల్డ్ ఫ్రెండ్లీ తెలంగాణ’అంశంపై జరిగిన సెమినార్లో పాల్గొన్నారు. పిల్లల సంతోషాలు, కళలను పట్టించుకోకపోవడంతో వారి బాల్యం బుగ్గిపాలవుతోందని, చాలా ప్రాంతాల్లో పిల్లలు బాలకార్మికులుగా మగ్గిపోతున్నారని, పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కాలేజీ ఆడిటోరియానికి కైలాశ్ సత్యార్థి ఆడిటోరియంగా నామకరణం చేశారు. ప్రతి ఒక్కరి బాధ్యత.. చిన్న పిల్లలపై లైంగిక దాడులు పెరగుతున్నాయని, ప్రతి గంటకు సగటున నలుగురు పిల్లలు లైంగికదాడులకు గురవుతున్నారని సత్యార్థి పేర్కొన్నారు. వీటి నిర్మూలనకు సమాజంలోని పౌరులంతా బాధ్యతగా కృషి చేయాలన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో బాలల హక్కులను పరిరక్షిస్తూ ప్రపంచంలోనే భారత్‌ను అగ్రగామిగా నిలుపుకొందామని పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఎంపీ వినోద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బాలమిత్ర సదస్సుకు హాజరయ్యారు. తల్లిదండ్రుల్లేని అనాథ పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంటులో బిల్లు పెట్టిన వినోద్‌ను అభినందించారు. నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లల సంక్షేమానికి 500 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు వివిధ రాష్ట్రాల్లో సత్యార్థి ఫౌండేషన్ సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని చాలా పాఠశాలల్లో టాయిలెట్లు లేక పిల్లలు బడి మానేస్తున్నారని చెప్పారు. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే పాఠశాలల్లో ఎన్నికలు, పార్లమెంట్, పంచాయితీ వంటివి ఏర్పాటు చేసి పిల్లలకు బాధ్యతలు తెలపాలని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. పిల్లల హక్కులు హరించే వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. -
మీ కృషి అభినందనీయం
దత్తాత్రేయకు కైలాశ్ సత్యార్థి ప్రశంస సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక, ఉపాథి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలోని కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖకు విచ్చేసిన కైలాశ్.. దేశంలో బాల కార్మికుల నిషేధ చట్టం, ప్రమాదకర పరిశ్రమల్లో 14–18 ఏళ్లలోపు బాలలను నియమించుకోవడంపై నిషేధం విధి స్తూ చట్టాలు రూపొందించడంపై ఆయన కేంద్ర మంత్రి దత్తాత్రేయను అభినందించారు. ఈ చట్టాలను రూపొందించి పార్లమెంటులో ఆమోదింపచేయడంలో కార్మికశాఖ కీలక పాత్ర పోషించిందని సత్యార్థి కొనియాడారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. బాలల హక్కుల కోసం ఉద్యమాలు చేసిన కైలాశ్ సత్యార్థి కృషి అభినందనీయమన్నారు. ఈ నెల 12 నుంచి జెనీవాలో అంతర్జాతీయ కార్మిక శాఖ మంత్రుల సమావేశాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. సమావేశంలో ఐఎల్వో డైరెక్టర్ పిన్ బిన్పాల్, కార్మిక శాఖ కార్యదర్శి సత్యవతి పాల్గొన్నారు.