'నాయకులు వస్తారు.. పోతారు'
మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ పథకం ప్రారంభం సందర్భంగా కోమటిబండలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో దత్తాత్రేయ ప్రారంభ ఉపన్యాసం చేశారు. మొదటిసారి తెలంగాణకు ప్రధాని మోదీ రావడం చాలా సంతోషంగా ఉందని దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రజలకు కష్టపడే పనిచేసే సత్తా ఉంటుందని, కల్లా కపటం తెలియన వారని చెప్పారు.
రాష్ట్రాలు భాగాలు అయితే, కేంద్రం అనేది తలకాయలాంటిదనే ఇవి రెండు సమన్వయంతోనే పనిచేస్తేనే మనుగడ సాధ్యం అని అన్నారు. ఒక చాయ్ అమ్మిన వ్యక్తి ప్రధానిగా మారాడంటే అది భారత దేశ, భారత ప్రజల గొప్పతనమే అని దత్తాత్రేయ చెప్పారు. నాయకులు వస్తుంటారు పోతుంటారని, కానీ ప్రజలు మాత్రం ఎప్పటికీ ఉంటారని, వారి శ్రేయస్సే ముఖ్యం అని దత్తాత్రేయ చెప్పారు. అలా ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా నమ్మి పనిచేసే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.