'దేశభవిష్యత్ను మార్చే డైనమిక్ లీడర్ మోడీ' | Dynamic leader Narendra Modi: Dattatreya | Sakshi
Sakshi News home page

'దేశభవిష్యత్ను మార్చే డైనమిక్ లీడర్ మోడీ'

Published Sun, Aug 11 2013 4:33 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

ఎల్ బి స్టేడియంలో బిజెపి నవభారత యువభేరీ - Sakshi

ఎల్ బి స్టేడియంలో బిజెపి నవభారత యువభేరీ

హైదరాబాద్: దేశభవిష్యత్ను మార్చే డైనమిక్ లీడర్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర  మోడీ అని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఎల్ బి స్టేడియంలో ఏర్పాటు చేసిన 'నవభారత యువభేరీ' బహిరంగ సభలో మోడీని నగర బిజెపి కమిటీ సత్కరించింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ  ఆయన మాట్లాడారు. బుల్లెట్ కంటే శక్తివంతమైన బ్యాలెట్ ద్వారా మోడీ నాయకత్వంలో మార్పు తీసుకువద్దామని  పిలుపు ఇచ్చారు.

రాష్ట్రంలో ప్రభుత్వంలేదు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు ప్రాంతాలవారీగా  రెండుగా  విడిపోయారు. రాజకీయ సంక్షోభం నెలకొంది. నేతలు రెండుగా విడిపోయారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని దత్తాత్రేయ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement