
బండారు దత్తాత్రేయ
హైదరాబాద్: అంసఘటిత కార్మికుల కోసం పారదర్శకమైన విధానాలు తీసుకొస్తున్నట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. అయితే యాజమాన్యాలపై వేధింపులు ఉండవని ఆయన భరోసా ఇచ్చారు. కార్మికుల శ్రేయస్సు కోసమే నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
కార్మికులకు నాణ్యమైన సేవలు అందించడం కోసం ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐపీలను ఆధునీకరిస్తామని దత్తాత్రేయ చెప్పారు.