ప్రధాని మోదీకి పాక్‌ సోదరి రాఖీ.. | PM Modi's Pakistani Sister To Visit Delhi To Tie Him Rakhi This Raksha Bandhan - Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి పాక్‌ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా..

Published Tue, Aug 22 2023 4:29 PM | Last Updated on Tue, Aug 22 2023 5:33 PM

PM Modi Pakistani Sister To Visit Delhi To Tie Him Rakhi - Sakshi

రక్షా బంధన్ రోజు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన పాకిస్తాన్ సోదరి రాఖీ కట్టనున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ రానున్నారని సమాచారం. పాకిస్థాన్‌కు చెందిన మహిళ ఖమర్ మొహసిన్ షేక్ తన వివాహం తర్వాత అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. గత 30 ఏళ్లుగా ప్రధాని మోదీకి రాఖీ కడుతూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.       

కరోనా కారణంగా గత మూడేళ్లుగా రావడం లేదు కానీ సంప్రాదాయం ప్రకారం స్పీడ్‌ పోస్టులో ప్రధాని మోదీకి రాఖీ పంపించారు మెహసిన్‌ షేక్. ఆయనకు పంపించే రాఖీ స్వయంగా ఆమె తన చేతులతో తయారు చేస్తానని చెప్పారు. గత ఏడాది పంపించిన రాఖీతో పాటు 2024 ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది స్వయంగా వచ్చి రాఖీ వేడుకలను ప్రధాని మోదీతో కలిసి జరుపుకోనున్నట్లు స్పష్టం చేశారు. పుస్తకాలు చదవడం అంటే ఇష్టం ఉండే తన అన్నకు వ్యవసాయానికి సంబంధించిన ఓ బుక్‌ను కూడా బహుకరించనున్నట్లు వెల్లడించారు. 

' రాఖీని నేనే తయారు చేశాను. ఈ సారి ఓ బుక్‌ను కూడా బహుమతిగా ఇవ్వనున్నాను. గత 2-3 ఏళ్లుగా కోవిడ్ కారణంగా కలవలేదు.. ఈ సారి మాత్రం తప్పకుండా కలుస్తాను. ప్రధాని మోదీకి సుధీర్ఘంగా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన కోరికలన్నీ నిజమవుగాక. అప్పట్లో గుజరాత్‌కు సీఎం అవ్వాలని కోరుకున్నా.. అలాగే అయ్యారు. రాఖీ కట్టిన ప్రతిసారి నరేంద్ర మోదీ పీఎం కావాలని కోరుకునేదాన్ని. నేను కోరుకునేవన్నీ దేవుడు ఇస్తాడని మా అన్న మోదీ అనేవాడు. దేశానికి ఎనలేని సేవ చేశాడు.' అని ఖమర్ మొహసిన్ షేక్ చెప్పారు. 

ఖమర్ మొహసిన్ షేక్ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా పనిచేసినప్పుడు గతంలో ప్రధాని మోదీకి మొదటిసారి రాఖీ కట్టినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 30 ఏళ్లుగా ప్రతి ఏడాది రాఖీని కడుతూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.  

ఇదీ చదవండి: 186 ఏళ్ల తర్వాత.. కొత్త చరిత్రకు శ్రీకారం,, భారత శిక్షా స్మృతి సరికొత్తగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement