Sistema
-
ప్రధాని మోదీకి పాక్ సోదరి రాఖీ..
రక్షా బంధన్ రోజు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన పాకిస్తాన్ సోదరి రాఖీ కట్టనున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ రానున్నారని సమాచారం. పాకిస్థాన్‌కు చెందిన మహిళ ఖమర్ మొహసిన్ షేక్ తన వివాహం తర్వాత అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. గత 30 ఏళ్లుగా ప్రధాని మోదీకి రాఖీ కడుతూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా రావడం లేదు కానీ సంప్రాదాయం ప్రకారం స్పీడ్ పోస్టులో ప్రధాని మోదీకి రాఖీ పంపించారు మెహసిన్ షేక్. ఆయనకు పంపించే రాఖీ స్వయంగా ఆమె తన చేతులతో తయారు చేస్తానని చెప్పారు. గత ఏడాది పంపించిన రాఖీతో పాటు 2024 ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది స్వయంగా వచ్చి రాఖీ వేడుకలను ప్రధాని మోదీతో కలిసి జరుపుకోనున్నట్లు స్పష్టం చేశారు. పుస్తకాలు చదవడం అంటే ఇష్టం ఉండే తన అన్నకు వ్యవసాయానికి సంబంధించిన ఓ బుక్‌ను కూడా బహుకరించనున్నట్లు వెల్లడించారు. ' రాఖీని నేనే తయారు చేశాను. ఈ సారి ఓ బుక్‌ను కూడా బహుమతిగా ఇవ్వనున్నాను. గత 2-3 ఏళ్లుగా కోవిడ్ కారణంగా కలవలేదు.. ఈ సారి మాత్రం తప్పకుండా కలుస్తాను. ప్రధాని మోదీకి సుధీర్ఘంగా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన కోరికలన్నీ నిజమవుగాక. అప్పట్లో గుజరాత్‌కు సీఎం అవ్వాలని కోరుకున్నా.. అలాగే అయ్యారు. రాఖీ కట్టిన ప్రతిసారి నరేంద్ర మోదీ పీఎం కావాలని కోరుకునేదాన్ని. నేను కోరుకునేవన్నీ దేవుడు ఇస్తాడని మా అన్న మోదీ అనేవాడు. దేశానికి ఎనలేని సేవ చేశాడు.' అని ఖమర్ మొహసిన్ షేక్ చెప్పారు. #WATCH | Ahmedabad, Gujarat: Qamar Mohsin Shaikh, PM Narendra Modi's rakhi sister says, "This time I have made the 'Rakhi' myself. I will also gift him (PM Modi) a book on agriculture as he is fond of reading. For the last 2-3 years I was unable to go due to Covid but this time I… pic.twitter.com/BMbbNrRyOP — ANI (@ANI) August 22, 2023 ఖమర్ మొహసిన్ షేక్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసినప్పుడు గతంలో ప్రధాని మోదీకి మొదటిసారి రాఖీ కట్టినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 30 ఏళ్లుగా ప్రతి ఏడాది రాఖీని కడుతూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: 186 ఏళ్ల తర్వాత.. కొత్త చరిత్రకు శ్రీకారం,, భారత శిక్షా స్మృతి సరికొత్తగా.. -
ఆర్‌కామ్–సిస్టెమా డీల్‌కు డాట్ అంగీకారం
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో (ఆర్‌కామ్) సిస్టెమా శ్యామ్(ఎస్ఎస్టీఎల్) విలీనానికి టెలికం విభాగం (డాట్) తాజాగా ఆమోద ముద్ర వేసింది. సిస్టెమా శ్యామ్ వైర్లెస్ వ్యాపార విలీనానికి డాట్ అంగీకారం లభించినట్లు ఆర్‌కామ్ తెలిపింది. అక్టోబర్ 20న ఈ డీల్‌కు ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. విలీన ఒప్పందం ప్రకారం.. ఎస్‌ఎస్‌టీఎల్‌కు సంబంధించిన వైర్లెస్ బిజినెస్ అసెట్స్ అన్నీ ఆర్‌కామ్ పరిధిలోకి వస్తాయి. విలీనానం తరం ఆర్‌కామ్‌లో సిస్టెమాకు 10 శాతం వాటా వస్తుంది. ఎయిర్‌సెల్ డీల్ అటకెక్కిన నేపథ్యంలో సిస్టెమా శ్యామ్ విలీన ఒప్పందానికి డాట్ ఆమోదం లభించడం ఆర్‌కామ్‌కు కొంత ఊరటనిచ్చే అంశం. డీల్‌కు సంబంధించిన లావాదేవీలు నవంబర్ తొలివారానికల్లా పూర్తి కావొచ్చని ఆర్‌కామ్ అంచనా వేస్తోంది. -
ఆర్‌కామ్ చేతికి ‘సిస్టెమా’
ఒప్పందం విలువ దాదాపు రూ. 4,500 కోట్లు * స్టాక్, స్పెక్ట్రమ్ ఫీజు చెల్లింపు రూపంలో డీల్ న్యూఢిల్లీ: దేశీయంగా నాలుగో అతి పెద్ద టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) .. తాజాగా సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్‌ను (ఎస్ఎస్టీఎల్) కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ దాదాపు 690 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,500 కోట్లు)గా ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా. స్టాక్ మార్పిడి, రూపంలో ఈ డీల్ ఉంటుందని ఆర్‌కామ్ సోమవారం తెలిపింది. దీని ప్రకారం సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ (ఎస్ఎస్టీఎల్)కు ఆర్‌కామ్‌లో 10 శాతం వాటాలు దక్కుతాయి. డీల్ పూర్తి కావడానికి ముందు తనకున్న దాదాపు 500 మిలియన్ డాలర్ల రుణాలను తీర్చేసేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రం ఎస్ఎస్టీఎల్ ద్వారా వచ్చే స్పెక్ట్రమ్‌కు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాయిదాలను ఏటా రూ. 392 కోట్లు చొప్పున పదేళ్ల పాటు ఆర్‌కామ్ కడుతుంది. సిస్టెమా శ్యామ్ ప్రస్తుతం తొమ్మిది సర్కిల్స్‌లో ఎంటీఎస్ బ్రాండ్ కింద సర్వీసులు అందిస్తోంది. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ దేశీ టెలికం రంగం పురోగమిస్తోందనడానికి రెండు సంస్థల విలీన మే నిదర్శనమని సిస్టెమా ప్రెసిడెంట్ మిఖాయిల్ షమోలిన్ పేర్కొన్నారు. విలీనంతో రెండు కంపెనీలకు పరస్పర ప్రయోజనం చేకూరగలదని ఆర్‌కామ్ సీఈవో గుర్దీప్ సింగ్ చెప్పారు. వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో డీల్ పూర్తి కాగలదని అంచనా. ఆర్‌కామ్‌కు ప్రయోజనాలు.. ఈ ఒప్పందంతో ఆర్‌కామ్ ఖాతాలో సుమారు 90 లక్షల కస్టమర్లు, దాదాపు రూ. 1,500 కోట్ల వార్షికాదాయాలు దఖలుపడతాయి. తద్వారా సంస్థ మొత్తం యూజర్ల సంఖ్య 11.8 కోట్లకు చేరుతుంది. అలాగే, 4జీ సేవలకు ఉపయోగపడే 850 మెగాహెట్జ్బ్యాండ్ స్పెక్ట్రం కూడా ఆర్‌కామ్‌కు లభిస్తుంది. భారీ ఆదాయాన్నిచ్చే ఢిల్లీ, గుజరాత్ తదితర 8 సర్కిల్స్‌లో సంస్థ లెసైన్సు కాలం సైతం 12 సంవత్సరాల మేర 2021 నుంచి 2033 దాకా పెరుగుతుంది. ఇక డీల్ ముగిసిన తర్వాత ఎస్ఎస్టీఎల్లోని మైనారిటీ ఇన్వెస్టర్లు.. తమ షేర్లకు బదులుగా ప్రో-రేటా ప్రాతిపదికన ఆర్‌కామ్ షేర్లను పొందే వెసులుబాటు ఉంటుంది. ఎస్ఎస్టీఎల్లో రష్యాకు చెందిన ఏఎఫ్‌కే సిస్టెమాకు 56.68 శాతం, రష్యా ప్రభుత్వానికి 17.14%, భారతీయ సంస్థ శ్యామ్ గ్రూప్‌నకు 23.98% వాటాలు ఉన్నాయి. మిగతా వాటాలు చిన్న ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. ఎస్ఎస్టీఎల్ రుణభారం, ఇతరత్రా చెల్లించాల్సినవి సుమారు రూ. 3,200 కోట్ల మేర ఉండగా, ఆర్‌కామ్ రుణ భారం రూ. 32,000 కోట్లుగా ఉంది. 2014-15లో ఆర్‌కామ్ ఆదాయాలు రూ. 21,423 కోట్లు కాగా, నికర లాభం రూ. 620 కోట్లు. అన్‌లిస్టెడ్ కంపెనీ అయిన ఎస్ఎస్టీఎల్ 2014 ఆదాయాలు రూ. 1,347 కోట్లు.