న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో (ఆర్‌కామ్) సిస్టెమా శ్యామ్(ఎస్‌ఎస్‌టీఎల్) విలీనానికి టెలికం విభాగం (డాట్) తాజాగా ఆమోద ముద్ర వేసింది. సిస్టెమా శ్యామ్ వైర్‌లెస్ వ్యాపార విలీనానికి డాట్ అంగీకారం లభించినట్లు ఆర్‌కామ్ తెలిపింది. అక్టోబర్ 20న ఈ డీల్‌కు ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం.
విలీన ఒప్పందం ప్రకారం.. ఎస్‌ఎస్‌టీఎల్‌కు సంబంధించిన వైర్‌లెస్ బిజినెస్ అసెట్స్ అన్నీ ఆర్‌కామ్ పరిధిలోకి వస్తాయి. విలీనానం తరం ఆర్‌కామ్‌లో సిస్టెమాకు 10 శాతం వాటా వస్తుంది. ఎయిర్‌సెల్ డీల్ అటకెక్కిన నేపథ్యంలో సిస్టెమా శ్యామ్ విలీన ఒప్పందానికి డాట్ ఆమోదం లభించడం ఆర్‌కామ్‌కు కొంత ఊరటనిచ్చే అంశం. డీల్‌కు సంబంధించిన లావాదేవీలు నవంబర్ తొలివారానికల్లా పూర్తి కావొచ్చని ఆర్‌కామ్ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment