ఎస్‌ఐకి రాఖీ కుడుతున్న విద్యార్థినులు
– ఘనంగా రాఖీ పండగ
మక్తల్ : రాఖీ పండగ పర్వదినం సందర్భంగా శుక్రవారం పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో అన్నాచెళ్లెల్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ వేడుకలు జరుపుకొన్నారు. అన్నాచెళ్లెల్లు అప్యాయతతో రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. ఇతర ప్రాంతాల నుంచి ఆడపడుచులు రావడంతో గ్రామాల్లో సందడి కనిపించింది. శ్రావణ మాసంలో రాఖీ పండగ రావడంతో ప్రత్యేక పూజలు చేశారు.
ఆత్మకూర్ : సోదరీసోదరుల అనురాగ బంధానికి ప్రతీక అన్నాచెళ్లెల్ల ప్రేమకు చిహ్నం రాఖీ. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెళ్లెల్లు, సోదరీలు తమ తమ్ముళ్లకు, అన్నలకు రక్షాబంధన్ కట్టి మిఠాయిలు తినిపించారు. ఆత్మకూర్‌లోని శిశుమందిర్‌లో వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చిన్నారులు పట్టణంలోని పురవీధుల గుండా తిరుగుతూ దుకాణ సముదాయాల వద్దకు వెళ్లి రాఖీలు కట్టారు. మూలమల్ల పుష్కరఘాట్‌లో మహిళా పోలీసులు న్యాయవాదులకు రాఖీలు కట్టారు.