ఫైల్‌ఫోటో
ఇస్లామాబాద్: రక్షాబంధన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ సోదరి కమార్ మోసిన్ షేక్ రాఖీ పంపించారు. ఈ సందర్భంగా 2024 జనరల్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ రాఖీ పండగకి పీఎం మోదీని కలిసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపారు మోసిన్ షేక్. రాఖీని రేష్మీ రిబ్బన్, ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో తానే సొంతంగా తయారు చేసినట్లు చెప్పారు. ఈసారి మోదీ తనను ఢిల్లీకి ఆహ్వానిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాఖీతో పాటు మోదీ ఆరోగ్యంగా ఉండాలని లేఖ రాశారు మోసిన్ షేక్. ‘నేను లేఖ రాశాను. ఆయన ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు చేస్తున్న మాదిరిగానే ముందు ముందు మంచిపనులు కొనసాగించాలి. 2024లో మళ్లీ మోదీనే ప్రధాని అవుతారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయనకు ఆ సామర్థ్యం ఉంది, అందుకు సరైన వ్యక్తి మోదీనే. ప్రతిసారి మోదీనే పీఎంగా ఉండాలి.’ అని పేర్కొన్నారు. గత ఏడాది సైతం రాఖీ, రక్షాబంధన్ కార్డు పంపించారు మోసిన్ షేక్.
ఇదీ చదవండి: ‘ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలం’.. ఇస్రో అధికారిక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment