Rakhsa bandhan
-
మోదీకి రాఖీ పంపిన పాక్ సోదరి.. మళ్లీ పీఎం కావాలని ఆకాంక్ష
ఇస్లామాబాద్: రక్షాబంధన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ సోదరి కమార్ మోసిన్ షేక్ రాఖీ పంపించారు. ఈ సందర్భంగా 2024 జనరల్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ రాఖీ పండగకి పీఎం మోదీని కలిసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపారు మోసిన్ షేక్. రాఖీని రేష్మీ రిబ్బన్, ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో తానే సొంతంగా తయారు చేసినట్లు చెప్పారు. ఈసారి మోదీ తనను ఢిల్లీకి ఆహ్వానిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాఖీతో పాటు మోదీ ఆరోగ్యంగా ఉండాలని లేఖ రాశారు మోసిన్ షేక్. ‘నేను లేఖ రాశాను. ఆయన ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు చేస్తున్న మాదిరిగానే ముందు ముందు మంచిపనులు కొనసాగించాలి. 2024లో మళ్లీ మోదీనే ప్రధాని అవుతారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయనకు ఆ సామర్థ్యం ఉంది, అందుకు సరైన వ్యక్తి మోదీనే. ప్రతిసారి మోదీనే పీఎంగా ఉండాలి.’ అని పేర్కొన్నారు. గత ఏడాది సైతం రాఖీ, రక్షాబంధన్ కార్డు పంపించారు మోసిన్ షేక్. ఇదీ చదవండి: ‘ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలం’.. ఇస్రో అధికారిక ప్రకటన -
మహిళలకు సీఎం వైఎస్ జగన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా దేశచరిత్రలోనే మహిళా సాధికారత విషయంలో ఎవ్వరూ వేయనన్ని ముందడుగులు వేసిన ప్రభుత్వంగా... రాష్ట్రంలోని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అమ్మకూ, నా మేనకోడళ్లు అందరికీ రాఖీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. చదవండి : సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా దేశచరిత్రలోనే మహిళా సాధికారత విషయంలో ఎవ్వరూ వేయనన్ని ముందడుగులు వేసిన ప్రభుత్వంగా... రాష్ట్రంలోని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అమ్మకూ, నా మేనకోడళ్లు అందరికీ రాఖీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 22, 2021 -
‘నీ డబ్బులన్నీ లాక్కుంటా..సతాయిస్తా’
‘నా కాళ్లు మొక్కి డబ్బులు ఇచ్చి, ఏదో ఒకటి తినిపించి.. ఆత్మీయంగా హత్తుకుంటావు కదా. ఒట్టేసి చెబుతున్నా నిన్ను సతాయించడం మానను, నీ డబ్బులు లాక్కుంటూనే ఉంటాను, నీ దగ్గర ఉన్న తినుబండారాలు అన్నీ నేనే తినేస్తా. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమగా ఆలింగనం చేసుకుంటా. ఈరోజు నిన్ను చాలా మిస్సవుతున్నా. నా చిన్ని తమ్ముడికి రక్షా బంధన్ శుభాకాంక్షలు’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ తన సోదరుడు ఇబ్రహీం అలీఖాన్‌కు ఆత్మీయ సందేశం పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. తమ్ముడు ఇబ్రహీంను ఆత్మీయంగా చూస్తున్న సారా చిన్ననాటి ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోకు ఇప్పటికే 8 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. కాగా సారా అలీఖాన్ బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ పటౌడీ కుటుంబానికి చెందిన వారన్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ దంపతుల తనయ అయిన సారా కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సింబా హిట్‌తో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రక్షాబంధన్ రోజు తోబుట్టువుకు దూరంగా ఉన్న సారా సోషల్ మీడియాలో తనకు విషెస్ చెప్పారు. ఇక అమృతాతో విడాకులు తీసుకున్న సైఫ్.. కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి కుమారుడైన తైమూర్ అలీఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. View this post on Instagram Happy Rakhi to my baby brother 🍼👶🤗👫 Missing you today- touching my 🦶, giving me 💰, feeding me 🍬 and hugging me 🤗. I promise to bully you, extort you, greedily eat all your food and force love and cuddles out of you forever. #bestbrother #partnerincrime #safeandsecure A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Aug 14, 2019 at 10:17pm PDT -
కృష్ణమ్మ సాక్షిగా..
కొల్లిపర: అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కృష్ణమ్మ సాక్షిగా గురువారం నిర్వహించారు. కృష్ణాపుష్కరాలు జరుగుతున్న నదీ పరివాహక ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం చెలెళ్లు అన్నలకు రాఖీలు కట్టారు. మండల కేంద్రంలోని తిరుపతమ్మగుడికి సమీపంలో ఉన్న కృష్ణానది వద్ద పలువురు చెలెళ్లు అన్నలకు రాఖీలు కడుతూ కనిపించారు. పొట్టిదిబ్బలంకకు చెందిన ముగ్గురు చెలెళ్లు అన్నకు కృష్ణమ్మ సాక్షిగా రాఖీ కట్టారు. -
చిట్టి మొక్కలు.. చెట్టన్నలు
తెనాలి: రాఖీ పర్వదినం సందర్భంగా నాజరుపేటలోని లూథరన్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ జాలా రాజకుమారి ‘చిట్టి మొక్కలు– చెట్టన్నల’ పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ప్రకృతి కవలలుగా వున్న అశోకచెట్లకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పవిత్రమైన రాఖీని కట్టారు. పాఠశాల ప్రారంభంలో 40 ఏళ్ల నాడు నాటిన రెండు మొక్కలు నేటి వరకు పెరుగుతూ ప్రకృతి మానవుల నుంచి ఎదురయే ఆటుపోట్లకు తలొగ్గక తమ నీడలో చల్లదనాన్నిస్తూ, చూపరులకు సతత హరితాన్నిస్తూ, ప్రేమతో ప్రాణవాయువు పంచుతున్నందుకు కృతజ్ఞతగా రాఖీని సమర్పించినట్టు రాజకుమారి చెప్పారు. ముఖ్యఅతిథిగా హాజరైన షారోన్ టాలెంట్ స్కూలు డైరెక్టర్ బెనర్జీ ఈ పాఠశాలకు వంద మొక్కలను బహూకరించారు. ప్రిన్సిపల్ మేరీ బెనర్జీ పర్యావరణంపై మాట్లాడారు. జ్యోతిశ్రీ విద్యార్థులతో ప్రకృతి ప్రతిజ్ఞ చేయించారు. ప్రియదర్శిని, శ్రీకాంత్, గీత, వాణి పాల్గొన్నారు.